Begin typing your search above and press return to search.
హీరోను కాబట్టి కేసీఆర్ కు నచ్చాను: జగన్
By: Tupaki Desk | 7 Jan 2019 6:30 AM GMTవచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి టీఆర్ ఎస్ మద్దతు ఇవ్వనుందనే వార్తలపై జగన్ స్పందించారు. ఆ వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఇప్పటివరకు వైసీపీ-టీఆర్ ఎస్ మధ్య అలాంటి చర్చలేవీ జరగలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ మద్దతు సహాయంతో టీఆర్ ఎస్ గెల్చిందని చెప్పడం సమంజసం కాదని కూడా జగన్ అభిప్రాయపడ్డారు. అలా చెప్పడం కేసీఆర్ గొప్పదనాన్ని చిన్నది చేసినట్లవుతుందని పేర్కొన్నారు. ప్రజాదరణ వల్లే టీఆర్ ఎస్ గెల్చిందని స్పష్టం చేశారు.
గులాబీ దళపతి కేసీఆర్ తో తనకు ప్రత్యేక స్నేహమేమీ లేదని జగన్ తేల్చిచెప్పారు. ఇప్పటివరకు ఒకే ఒక్కసారి ఆయనతో ఫోన్ లో మాట్లాడానని తెలిపారు. అది కూడా తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాకేనన్నారు.
ఫలితాల అనంతరం కేసీఆర్ కు ఫోన్ చేసి గొప్ప విజయం సాధించారంటూ అభినందించినట్లు చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ, కాంగ్రెస్ లతో పోలిస్తే కేసీఆర్ ఎంతో నయమని జగన్ వ్యాఖ్యానించారు. ఏపీతో సంబంధం లేనప్పటికీ రాష్ట్ర ప్రత్యేక హోదాకు మద్దతుగా కేసీఆర్ మాట్లాడుతున్న సంగతిని గుర్తుచేశారు. అవసరమైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానని ముందుకొచ్చారని తెలిపారు. అలాంటి కేసీఆర్ ను స్వాగతిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఏపీ - తెలంగాణల్లో మొత్తంగా 42 ఎంపీ సీట్లున్నాయని.. వారంతా కలిసి కట్టుగా పోరాడితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కష్టమేమీ కాదని జగన్ సూచించారు. పూర్తిగా ఏపీపై దృష్టిపెట్టడం వల్లే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయామని జగన్ తెలిపారు. తాము అక్కడ పోటీ చేసి ఉంటే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెల్చి ఉండేవారు కాదని పేర్కొన్నారు.
కేసీఆర్ తనపై చూపుతున్న ప్రత్యేక అభిమానంపై కూడా జగన్ వివరణ ఇచ్చారు. సాధారణంగా ఎవరైనా సినిమాకు వెళ్లినప్పుడు అందులో హీరో పాత్రను ఇష్టపడతారని అన్నారు. తనను కేసీఆర్ అభిమానిస్తుండటానికీ అదే కారణమన్నారు. ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడుతూ - ప్రత్యేక హోదా కోసం అలుపెరగకుండా తాను పోరాడుతున్నానని వ్యాఖ్యానించారు. ఏపీ రాజకీయాల్లో తనను తాను హీరోగా - చంద్రబాబును విలన్ గా అభివర్ణించారు. హీరోను కాబట్టే తనను కేసీఆర్ సహా అందరూ ఇష్టపడుతున్నారంటూ వివరించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు తాను ఏ పార్టీకీ మద్దతివ్వబోనని జగన్ స్పష్టం చేశారు. కేంద్రంలో ఏదైనా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అప్పుడు ఆ పార్టీకి మద్దతిస్తామని వెల్లడించారు. బీజేపీ - కాంగ్రెస్ అనే తేడా లేకుండా ఎవరు హోదా ఇస్తే వారికే స్నేహహస్తం అందిస్తామని చెప్పారు. దేవుని దయ - ప్రజల దీవెనలు వైసీపీకి ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధించడం ఖాయమని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.