Begin typing your search above and press return to search.

బాబుపై మైండ్ గేమ్ మొద‌లెట్టేసిన జ‌గ‌న్!

By:  Tupaki Desk   |   14 Jun 2019 6:54 AM GMT
బాబుపై మైండ్ గేమ్ మొద‌లెట్టేసిన జ‌గ‌న్!
X
ఒకే ఒక్క మాట‌తో బాబుకు ప‌క్క‌నే బాంబు ప‌డ్డ ఫీలింగ్ తేవ‌టంతో ఏపీ ముఖ్య‌మంత్రిజ‌గ‌న్ స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా.. ఎలాంటి మొహ‌మాటం లేకుండా ఆయ‌న స్టార్ట్ చేసిన మైండ్ గేమ్ ఇప్పుడు బాబుకు మ‌హా ఇబ్బందిక‌రంగా మారింది. నిజ‌మా? అబ‌ద్ధ‌మా? అన్న‌ది ప‌క్క‌న పెడితే.. టీడీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురిని లాగేసుకుంటే చంద్ర‌బాబుకు ఉన్న ప్ర‌తిప‌క్ష హోదా పోతుంద‌ని.. అలా చేయాల‌ని తాను అనుకోన‌ని చెప్పాలి.

హ‌మ్మ‌య్య‌.. అంటూ ఊపిరి పీల్చుకునే వేళ‌లో మ‌రో మాట‌ను చెప్పేసి.. హార్ట్ బీట్ ను మ‌రింత పెంచే ప్ర‌య‌త్నం చేశారు. ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో జ‌గ‌న్ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. త‌న పార్టీకి చెందిన 23 మందిని సంత‌లో ప‌శువుల మాదిరి కొనేసిన దానికి బ‌దులు తీర్చుకోవ‌టానికి జ‌గ‌న్ ఏ మాత్రం సంశ‌యించ‌టం లేదు. అంతేకాదు.. తాను ఎమ్మెల్యేల్ని లాగేయ‌న‌ని.. ఒక‌వేళ ఎవ‌రైనా వ‌స్తే.. వారిని రాజీనామా చేయించిన త‌ర్వాతే తాను పార్టీలోకి తీసుకుంటాన‌ని చెప్పారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ ఇమేజ్ ఎంత‌న్న‌ది తెలిసిందే. ఇలాంటి వేళ‌లో.. టీడీపీ ఎమ్మెల్యేలు ప‌లువురు తాము రాజీనామా చేసి వ‌స్తామ‌ని.. త‌మ‌కు నామినేట్ పోస్టులు ఇస్తే స‌రిపోతుంద‌ని జ‌గ‌న్ ను కోరితే.. ఆయ‌న ఓకే అంటే.. టీడీపీ ఆస్తిత్వానికే ప్ర‌మాదంగా మారుతుంద‌ని చెప్పాలి.175 మంది ఉన్న ఏపీ అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బ‌లం త‌న‌కు ఉన్న వేళ‌.. అద‌నంగా ఎమ్మెల్యేల్ని తీసుకోవాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్ కు లేదు.

అయితే.. మైండ్ గేమ్ లో భాగంగానే బాబు ఉలిక్కిప‌డేలా.. త‌న స‌హ‌చ‌రుల‌ను ఎవ‌రిని న‌మ్మ‌కంలోకి తీసుకునేందుకు వీలు లేని రీతిలో జ‌గ‌న్ మాట‌లు వెంటాడుతుంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జ‌గ‌న్ తీరుకు త‌గ్గ‌ట్లే ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక టీవీ చాన‌ల్ పెట్టిన డిబేట్ లో మాట్లాడుతూ.. త‌మ‌కు 8 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్న‌ట్లుగా చెప్పటం క‌నిపిస్తోంది. తెలుగు త‌మ్మ‌ళ్లు ట‌చ్ లో ఉన్నార‌న్న మాట‌తో బాబు మీద మ‌రింత ఒత్తిడి తెచ్చే ప్ర‌య‌త్నంలో ఏపీ అధికార‌ప‌క్షం ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ట‌చ్ లో ఉన్న మాట వాస్త‌వ‌మే అయి ఉండొచ్చ‌ని.. కాకుంటే.. బాబు మీద ప్రెజ‌ర్ బిల్డ్ చేసేందుకు వీలుగా ట‌చ్ అస్త్రాన్ని వినియోగిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.