Begin typing your search above and press return to search.
కేసీఆరే కాదు.. మోడీ కూడా హగ్ ఇచ్చాడు..
By: Tupaki Desk | 26 May 2019 7:19 AM GMTఏపీలో దాదాపు క్లీన్ స్వీప్ చేసేసిన జగన్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఢిల్లీలోనూ ఘన స్వాగతం లభించింది. ఆదివారం ప్రధాని నరేంద్రమోడీని కలవడానికి ఢిల్లీ వెళ్లిన జగన్ కు అక్కడ నాయకులు, కార్యకర్తలు స్థానికులు అక్కున చేర్చుకున్నారు. ఇక జగన్ ను చూడగానే మోడీ దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకోవడం విశేషం. హైదరాబాద్ లో కేసీఆర్.. ఢిల్లీ లో మోడీ చంద్రబాబును చిత్తుగా ఓడించిన జగన్ ను ఇలా గుండెలకు హత్తుకొని కొనియాడడం విశేషంగా మారింది. మోడీ, కేసీఆర్ లకు ఉమ్మడి శత్రువైన చంద్రబాబును అంత దారుణంగా జగన్ ఓడించడంతో సహజంగానే వారిద్దరిలో జగన్ పై అప్యాయత పెరిగిందనే చెప్పవచ్చు.
రెండోసారి గద్దెనెక్కిన మోడీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఏపీలో సునామీ సృష్టించిన జగన్ కు కూడా మోడీ అభినందనలు తెలిపారు. ఇక మోడీతో గంట పాటు సాగిన సమావేశంలో ప్రధానంగా జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ను ప్రస్తావించినట్టు తెలిసింది.
2011 నుంచి జగన్ వైసీపీని స్థాపించి పోరాడుతున్నారు. దాదాపు పదేళ్లుగా ప్రతిపక్షంలోనూ ఉంటూ తాజా ఎన్నికల్లో అఖండ మెజార్టీని సాధించారు. ప్రత్యేక హోదా డిమాండ్ సాధనే ధ్యేయంగా ప్రమాణ స్వీకారం చేయకముందే మోడీ ముందు హోదా డిమాండ్ ను పెట్టి ఒకింత జగన్ తన స్పష్టతను... ప్రజల కోరిక తీర్చడంలో అభిలాషను ఈ సందర్భంగా బయటపెట్టినట్టైంది. ప్రజా హామీల విషయంలో వెనక్కి తగ్గనని జగన్ మెసేజ్ ఇచ్చినట్టైంది.
కేంద్రంలో మోడీని గద్దెదించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అలాంటి చంద్రబాబును ఢిల్లీ గడప తొక్కకుండా చేసి చిత్తుగా ఓడించిన జగన్ పై స్వతహాగానే బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా చూస్తోంది. అందుకే జగన్ అపాయింట్ మెంట్ అడగ్గానే మోడీ గంటసేపు కేటాయించడం విశేషం. కేసీఆర్ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని బాబుకు హామీ ఇచ్చాడు. అది నెరవేరిపోయింది. ఇలా ఉమ్మడి శత్రువైన చంద్రబాబు ఓటమి.. సహజంగానే మోడీ, కేసీఆర్ శిబిరాల్లో ఆనందం నింపింది. అదే జగన్ వైపు సానుకూలతను తెచ్చిపెట్టింది. ఆయన్ను అక్కున చేర్చుకునేలా చేస్తోంది.