Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఫోక‌స్ మార్చేశాడు

By:  Tupaki Desk   |   22 July 2016 11:17 AM GMT
జ‌గ‌న్ ఫోక‌స్ మార్చేశాడు
X
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి త‌న ఫోక‌స్ మార్చేశారు. ఏపీలో పార్టీ బ‌లోపేతం కోసం గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ పేరుతో కార్య‌క్ర‌మం చేప‌డుతున్న‌ట్లుగానే తెలంగాణాలో పార్టీ బలోపేతంపై ఆయ‌న దృష్టి పెట్టార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ వైపే ప్రాధాన్యతనిస్తున్నారంటూ ఆ పార్టీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో కొత్త కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించార‌ని స‌మాచారం.

తెలంగాణలో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఒక ఎంపీ సహా - ముగ్గురు ఎమ్మెల్యేలు కారెక్కడంతో వైసీపీ డీలా పడిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పార్టీ మళ్లీ పుంజుకునేందుకు వైఎస్ జ‌గ‌న్‌ కార్యాచ‌ర‌ణ మొద‌లుపెట్టారు. ఈ బాధ్య‌త‌లు పార్టీ ముఖ్య‌ల‌కు అప్ప‌గించారు. దీంతో లోటస్‌ పాండ్‌ లో పార్టీ అగ్ర‌నేత‌లు జిల్లాలవారీగా సమీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మహబూబ్ నగర్ - నల్గొండ - రంగారెడ్డి - వరంగల్ - ఆదిలాబాద్ జిల్లాల సమీక్షలు పూర్తయ్యాయి. మిగ‌తా జిల్లాలు పూర్త‌యిన త‌ర్వాత‌ మరో రెండు నెలల్లో తెలంగాణాలో గ్రామ స్థాయి నుంచి మండల - జిల్లా కమిటీల ఏర్పాటుతో పాటు అనుబంధ సంఘాల నియామాకాన్ని కూడా పూర్తి చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్సార్ వర్ధంతిని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కూడా నేతలు సిద్ధమవుతున్నారు. అదే స‌మ‌యంలో ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ నేత‌లు సూచించారు.

స‌మీక్ష‌లు పూర్త‌యిన త‌ర్వాత త్వ‌ర‌లో పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నాయ‌కులంద‌రితో క‌లిసి స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ ప్రాధామ్యాల‌ను వివ‌రించనున్నారు. మొత్తంగా తెలంగాణాలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టిన‌ వైసీపీ నేతలు ఇటు ప్రజావ్యతిరేక విధానాలు - పార్టీ నాయ‌కుల‌తో స‌త్సంబంధాలు అజెండాగా ముందుకుపోతున్నార‌ని అంటున్నారు.