Begin typing your search above and press return to search.

ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ!

By:  Tupaki Desk   |   25 Feb 2020 12:02 PM GMT
ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ!
X
ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో వరల్డ్‌ బ్యాంక్‌ దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్‌ డైరెక్టర్‌ షెర్‌ బర్న్‌ బెంజ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్‌ నిధులతో చేపట్టే పలు అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం వారితో చర్చించారు. విద్య - వైద్యం - వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను సీఎం జగన్‌ వారికి వివరించారు.

కాగా. ఏపీ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం ప్రశంసలు కురిపించింది. సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. మానవ వనరులపై పెట్టుబడి ద్వారా అభివృద్ది ఫలితాలు వస్తాయని ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని ప్రతినిధులు వెల్లడించారు.