Begin typing your search above and press return to search.

కుండబద్ధలు కొట్టబోతున్న జగన్....2న హాట్ హాట్ మీటింగ్

By:  Tupaki Desk   |   30 Jan 2023 9:23 PM GMT
కుండబద్ధలు కొట్టబోతున్న జగన్....2న హాట్ హాట్ మీటింగ్
X
ముఖ్యమంత్రి జగన్ విషయంలో ముక్కుసూటిగానే వ్యవహారం ఉంటుంది. ఈ విషయంలో ఎక్కడా నాన్చడాలు ఉండవు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం జగన్ కొంత సంయమనంతో ఉంటున్నారు. అందుకే ఆయన తన వ్యవహార శైలికి భిన్నంగా ఎమ్మెల్యేలకు చాలా టైం ఇచ్చారు. గత ఏడాది మే నెలలో జగన్ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు. నాటి నుంచి వీలు కుదిరినపుడల్లా పెడుతున్నారు. ఇప్పటికి పది నెలల సమయం కావస్తోంది.

ఎమ్మెల్యేల పనితీరు మీద కచ్చితమైన అంచనా అయితే జగన్ కి ఉంది అదే టైం లో వీలు అయినంత సమయం ఇచ్చినా కూడా దాన్ని వాడుకున్న వారు ఉన్నారు. వాడుకోలేని వారు ఉన్నారు. మా వల్ల కాదు మేము ఇంతే అనే వారున్నారు. ఈ కేటగిరీలను అన్నింటినీ ఎప్పటికపుడు తనకు అందుతున్న సర్వే నివేదికల ఆసరాతో బేరీజు వేసుకుంటున్న జగన్ ఇపుడు మరోసారి కీలకమైన సమావేశానికి పిలుపు ఇచ్చారు.

ఫిబ్రవరి 2న ఆయన ముఖ్య నేతలు, రీజనల్ కో ఆర్డినేటర్లతో మీటింగ్ పెడుతున్నారు. ఈ సమావేశం చాలా ప్రాధాన్యత వహిస్తుందని అంటున్నరు. ఒక వైపు వాలంటీర్లకు సమాంతరంగా గృహ సారధులను నియామకం చేసుకోమని జగన్ చెప్పారు. అయితే అది ఎంతదాకా వచ్చింది అని కూడా తెలుసుకోనునారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోకవర్గాల్లో ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున 15 వేల గ్రామాల్లో 5.20 లక్షల మందిని పార్టీ తరఫున గృహ సారథులుగా నియమించాలని గతంలోనే ముఖ్యమంత్రి ఆదేశించారు. గృహ సారథులు కూడా అదే క్లస్టర్‌కు చెందిన వారై ఉండాలన్నారు. వీరు బూత్‌ కమిటీలలో సభ్యులుగా కూడా ఉంటారని సీఎం జగన్ తెలిపారు.

అదే విధంగా ఎమ్మెల్యేల పనితీరు మీద మళ్లీ చర్చ ఉంటుందని అంటున్నారు. ఇక గృహ సారధులకు శిక్షణా కార్యక్రమాలు ఇదిలా ఉండగా రీజనల్ కో ఆర్డినేటర్ల మీటింగులో జగన్ వారి పనితీరుతో పాటు పర్టీ గురించిన సమాచారం వారి వద్ద ఎలా ఉందో ఎంత ఉందో సేకరిస్తారు అని అంటున్నారు. తన వద్ద సమాచారం వారితో పంచుకుంటారు అని అంటున్నారు. అదే విధంగా జిల్లా ప్రెసిడెట్లతో పాటు, ఎమ్మెల్యేలతో రీజనల్ కో ఆర్డినేటర్లు మరింతగా కలసి మెలసి పోవాలని వారిని పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేఅయలని జగన్ కోరుతారు అని అంటున్నారు.

ఇక ఏపీలోనే ఎక్కువ సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని, ఏకంగా 87 శాతం మందికి ఇవి అందుతున్నాయని వాటిని ఓట్ల రూపంలో మార్చుకోకపోతే ఎలా అన్నది జగన్ ఆలోచనగా ఉంది. దాంతో ఆ విషయం కూడ రీజనల్ కో ఆర్డినేటర్లకు స్పష్టం చేస్తారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే వైసీపీకి పార్టీకి పట్టుగా ఉన్న నెల్లూరు వంటి జిల్లాలలో ధిక్కార స్వరాలు ఎమ్మెల్యేలు వినిపిస్తున్నారు.

దీని విషయం మీద కూడా రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ చర్చిస్తారు అంటున్నారు. ఏ రూపేణ అయినా ఇలాంటి తిరుగుబాటు ధోరణిని సహించేది లేదని జగన్ చెబుతారు అని అంటున్నారు. ఇక పార్టీలో ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో బాగా తెలిసిన జగన్ ఇక ఎవరికీ ఏ రకంగానూ చాన్స్ ఇచ్చే స్థితిలో లేరని అంటున్నారు. ఆయన దాన్ని స్పేర్ చేయరని అంటున్నారు. అవసరం అయితే ఎంతటి పెద్ద నిర్ణయం అయినా తీసుకుంటారు అని అంటున్నారు.

ఈ రీజనల్ కో ఆర్డినేటర్ల మీటింగులోనే జగన్ చెప్పాల్సినవి అన్నీ కుండబద్ధలు కొడతారు అని అంటున్నారు. పార్టీని ఎన్నికలకు రెడీ చేస్తున్న సమయంలో మధ్యలో ఇలాంటి తలనొప్పులు ఉంటే సహించేది లేదని కూడా ధిక్కార స్వరాలకు వార్నింగ్ ఇస్తారని అంటున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు ఇస్తామని చెబుతున్న జగన్ ధిక్కారం చేసే వారిని పూర్తిగా పక్కన పెడతారు అంటున్నారు. తన మాటగా ఆ మాట చెప్పాలని ఆయన రీజనల్ కో ఆర్డినేటర్లను కోరుతారు అని అంటున్నారు. ఇక పార్టీని సీనియర్లను ముందుంచి నడిపించాలని కూడా జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.