Begin typing your search above and press return to search.
విద్యలో జగన్ మార్క్ - డిగ్రీ నాలుగేళ్ళు... ఇంజినీరింగ్ ఐదేళ్లు...
By: Tupaki Desk | 30 Nov 2019 7:05 AM GMTతొలిసారి అధికారంలోకి వచ్చి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకుపోతున్న సీఎం జగన్... మరొక సంచలనం దిశగా ముందుకెళుతున్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. డిగ్రీ, ఇంజినీరింగ్ చేసే విద్యార్ధులకు ఉద్యోగాలు పొందేందుకు తగిన నైపుణ్యం అందించేందుకు ఒక సంవత్సరం అదనంగా అప్రెంటిస్ షిప్ ప్రోగ్రాం పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం డిగ్రీ మూడేళ్లు, ఇంజినీరింగ్ కోర్సులు నాలుగేళ్లలో పూర్తి అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారు తమ కోర్సులని పూర్తి చేసి డిగ్రీ పట్టాలు పొందిన, ఉద్యోగాలు పొందడం విషయంలో మాత్రం వారికి తగిన నైపుణ్యం ఉండటం లేదు. దీంతో వారికి ఉద్యోగాల పొందేందుకు ఒక సంవత్సరం అదనంగా అప్రెంటిస్ షిప్ ప్రోగ్రాంని తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి దీనిపై విధివిధానాలని రూపొందిస్తున్నారు. అయితే ఈ అప్రెంటిస్ షిప్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు పొందే విద్యార్ధులకు వర్తిస్తాయి.
అయితే ఈ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ విద్యార్ధులకు మొదటి, రెండో సంవత్సరాల్లో లైఫ్ స్కిల్స్ కోర్సులు ఉంటాయి. అలాగే చివరి సంవత్సరం చివరి సెమిస్టర్‌లో నైపుణ్య కోర్సులను చదవాలి. ఇక ఇంజినీరింగ్ వాళ్ళకు ఎలాగో నాలుగు సంవత్సరాలు టెక్నికల్ కోర్సులు ఉంటాయి. అయితే డిగ్రీ మూడేళ్లు, ఇంజినీరింగ్ నాలుగేళ్ళు పూర్తి చేసిన విద్యార్ధులు ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ చేయాలి. అప్రెంటిస్ షిప్ చేసే ఏడాది సమయంలో విద్యార్ధుల ఫీజులని ప్రభుత్వమే చెల్లించనుంది. దాంతో పాటు అదనంగా వసతి, భోజనానికి రూ. 20 వేలు ఇస్తారు.
కాకపోతే ఈ అప్రెంటిస్ షిప్ సమయంలో కంపెనీలు విద్యార్ధులకు ఉపకారవేతనాలు వేస్తే ప్రభుత్వం ఎలాంటి చెల్లింపులు చేయదు. కోర్సులు పూర్తిచేశాక ఉద్యోగం పొందేందుకు విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని తీసుకొచ్చింది. అలాగే రాష్ట్రంలో జాతీయ నైపుణ్యభివృద్ధి సంస్థ జిల్లాల వారీగా సర్వే చేసి, ఆయా జిల్లాలో పేరుగాంచిన రంగాలని గుర్తించి, వాటిని విద్యార్ధులకు కోర్సులుగా అందించనున్నారు. వీటితో పాటు డిగ్రీ చదువుకునేవారు వారు కోరుకున్న కోర్సులని కూడా ప్రవేశపెట్టనున్నారు - VS Rao