Begin typing your search above and press return to search.

నేనున్నా... నాదే భరోసా.... పెట్టుబడులకు జగన్ మార్క్ దన్ను

By:  Tupaki Desk   |   3 March 2023 6:00 PM GMT
నేనున్నా... నాదే భరోసా.... పెట్టుబడులకు జగన్ మార్క్ దన్ను
X
ఏపీలో పెట్టుబడులు పెట్టండి. మీకు ఏ భయం లేదు. నాదే అభయం. నేనున్నాను, నాదే భరోసా అంటూ ముఖ్యామంత్రి హోదాలో జగన్ గట్టిగానే నమ్మకం పెంచారు. మీ పెట్టుబడులకు మా ప్రభుత్వం రక్షణగా ఉంటుంది. మీరు పెట్టుబడులు ఏ పేచీ లేకుండా పెట్టుకోవచ్చు అంటూ వైసీపీ ప్రభుత్వం తరఫున ఆయన హామీ ఇచ్చారు.

ఏపీలో అద్భుతమైన పారిశ్రామిక పాలసీని రూపకల్పన చేశాం, ఏమి కావాలో అన్నీ ఇస్తాం, ఏపీలో లేనిది లేదు, నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి, ఇక భౌగోళికంగా చూస్తే ఏపీ అన్ని విధాలుగా భద్రంగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. శ్రేయస్కరంగా ఉంటుంది అని జగన్ చెప్పుకొచ్చారు.

ఏపీలో ఇప్పటికే ఆరు పోర్టులు ఉన్నాయి, మరో నాలుగు పోర్టులు రాబోతున్నాయని జగన్ ఏపీ అభివృద్ధి గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఏపీలో యూత్ టాలెంట్ కి ఎక్కడా ఢోకా లేదు. వారు అంతా కష్టించి పనిచేసే వారే. సో మానవ వనరులు దండీగా ఉన్నాయని జగన్ చెప్పారు.

ఏపీ నుంచి ఎగుమతులు పెగిరాయి. అవి ఇంకా రెట్టింపు కానున్నాయి. ఇది ఏపీ ప్రగతిని ఒక నిదర్శనం అని జగన్ గుర్తు చేశారు. ఇక దేశవ్యాప్తంగా పదకొండు పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని అందులో ఏపీలోనే మూడు ఉన్నాయని ఆయన వివరించే ప్రయత్నం చేశారు.

ఏపీకి పెట్టుబడులు వెల్లువలా రావడం ఖాయమని పెట్టుబడుల సదస్సులో ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి ఇన్వెస్టర్స్ దేశ విదేశాల నుంచి వస్తున్నారని, పదమూడు లక్షల కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని జగన్ వివరించారు. ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని ఆయన అంటున్న్నారు.

ఏపీ ఏ రాష్ట్రానికి తీసిపోదని, దేశంలో అత్యంత కీలకమైన పాత్రను ఏపీ పోషిస్తోందని జగన్ చెప్పడం విశేషం. ఏపీ అభివృద్ధి ఈ రోజు దేశంలో చర్చగా ఉందని, రానున్న రోజుల్లో ఏపీ దేశంలో ముందంజలో ఉండబోతోంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మంచి పారిశ్రామిక విధానాన్ని తమ ప్రభుత్వం రూపకల్పన చేసింది అని జగన్ తెలిపారు.

ఏపీలో ప్రధానంగా ఇరవై కీలకమైన రంగాలు ఉన్నాయని పెట్టుబడులు పెట్టేందుకు ఇవి ఎంతో అనుకూలమని, అరుదైన రంగాలు కూడా దేశంలో ఏపీలోనే ఉన్నాయని ఆయన చెప్పడం గమనార్హం. ఏపీకి వచ్చిన వారు వెనక్కి పోరు, మీ పెట్టుబడులకు నా పూచీ కత్తు అంటూ జగన్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునే ప్రసంగమే చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.