Begin typing your search above and press return to search.
జగన్ మార్క్ ఫైనల్ వార్నింగ్....ఎవరికి అంటే....?
By: Tupaki Desk | 9 Feb 2023 8:00 AM GMTజగన్ మార్క్ పాలిటిక్స్ వేరుగా ఉంటుంది. ట్రెడిషనల్ పాలిటిక్స్ కి ఆయన దూరంగా ఉంటారు. తనదైన శైలిలో ఆయన పాలన అయినా పార్టీ అయినా ఉంటుంది. వైసీపీని ఆయన అదే తీరున నడిపిస్తున్నారు. నచ్చిన వారు ఉంటున్నారు. లేని వారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలా బయటకు వెళ్తున్నారు. ఇక జగన్ కూడా తనకు నచ్చని వారిని కొందరుకి షాకులు ఇస్తారని అంటున్నారు.
గత ఏడాది చివరిలో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి పనితీరు మీద ప్రొగ్రెస్ రిపోర్టు ఇచ్చిన సీఎం జగన్ ఇపుడు మరో డేట్ ని ఫిక్స్ చేసి వారులో గుబులు రేపారు. ఈ నెల 13న ఎమ్మెల్యేలు, మంత్రులు రీజనల్ కో ఆర్డినేటర్లతో విస్తృత స్థాయి మీటింగుకు జగన్ రెడీ అవుతున్నారు. ఈ నెల 2న రీజనల్ కో ఆర్డినేటర్లతో మీటింగ్ పెట్టి కొంత సమాచారం ఇచ్చి పుచ్చుకున్న జగన్ ఈసారి ఎమ్మెల్యేలతో ముఖాముఖీ భేటీ కాబోతున్నారు.
ప్రతీ సచివాలయం పరిధిలో ఇద్దరు గృహ సారధులను నియమించాలని జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అయితే చాలా చోట్ల అది జరిగినా ఇంకా జరగాల్సి ఉంది. దాని మీద రీజనల్ కో ఆర్డినేటర్ల మీటింగులోనే గట్టిగా చెప్పేసిన జగన్ ఇపుడు ఎమ్మెల్యేలను అదే విషయం మీద అడగబోతున్నారు. దాంతో పాటు ఎమ్మెల్యే పనితీరు మీద తాను స్వయంగా చేయించిన రెండు సర్వేలతో పాటు ఐ ప్యాక్ సర్వేలను క్రోడీకరించి తయారు చేసిన రిపోర్టులను బయటపెడతారు అని అంటున్నారు.
గతసారి ఎమ్మెల్యేల మీటింగులో ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని మార్చుకోవాలని జగన్ సూచించారు అని అంటున్నారు. ఈసారి మరి ఆ నంబర్ పెరిగిందా తగ్గిందా అన్న చర్చ ఉంది. అదే టైం లో ఎమ్మెల్యేలంతా పూర్తిగా ఈ ఏడాది ప్రజలలోనే ఉండాలని జగన్ ఆదేశించనున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగియగానే జగన్ కూడా పల్లె నిద్ర పేరిట జనంలో ఉంటారని అంటున్నారు. అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలను జనంలో ప్రచారం చేస్తూ ప్రజలతో కనెక్ట్ అయి పనితీరు మెరుగుపరచుకున్న వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు అని జగన్ ఇప్పటికే కచ్చితంగా చెప్పారు.
ఇపుడు ఈ నెల 13న జరిగే మీటింగులో అయితే ఫైనల్ వార్నింగ్ ఇస్తారని అంటున్నారు. ఇక మీదట పనితీరు మార్చుకోకపోయినా తీరు మార్చుకోకపోయినా కూడా ఇంతే సంగతులు ఇదే చివరి చాన్స్ అని సీఎం చెప్పేస్తారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పనితీరు బాగా లేని వారిలో విధేయత కలిగి పార్టీ పట్ల చిత్త శుద్ధి ఉన్న వారిని పిలిచి పార్టీ రెండవ మారు అధికారంలోకి వస్తే వారిని తగిన న్యాయం చేస్తామని జగన్ చెప్పదలచుకున్నారు అని అంటున్నారు.
మొత్తానికి చూస్తే జగన్ ఈ నెల 13న నిర్వహించే ఎమ్మెల్యేల భేటీ మాత్రం చాలా కీలకంగా చెబుతున్నారు. ఎందుకంటే ఈ భేటీ తరువాత సీఎం కూడా పూర్తి బిజీ అవుతారు అని ఆ మీదట మరోసారి మీటింగ్ ఉంటుందా లేదా అన్నది కూడా తెలియదు అంటున్నరు. ఎందుకంటే మార్చిలో బడ్జెట్ మీటింగ్ ఉంటుంది. అదే మార్చిలో గ్లోబల్ సమ్మిట్ ఉంటుంది. అదే నెలాఖరులో జీ 20 సదస్సు ఉంటుంది. ఆ తరువాత ఏప్రిల్ నెల వస్తే జగన్ కూడా పల్లె నిద్ర పేరిట ఏపీ అంతా బస్సు టూర్లు వేస్తారు అని అంటున్నారు.
దాంతో పార్టీకి సంబంధించి కీలక ఆదేశాలు సూచనలు నిర్ణయాలు జగన్ పూర్తిగా విడమరచి చెప్పేది మాత్రం ఈ మీటింగులోనే అని అంటున్నారు. దాంతో జగన్ ఏమి చెప్పబోతున్నారు. ఎవరిని ఏ విధంగా ప్రశ్నిస్తారు, ఎవరి పని తీరు ఎలా ఉంటుంది సర్వేలు ఏమి చెబుతున్నాయి. సీఎం జగన్ ఇచ్చే ఫైనల్ వార్నింగ్ ఎలా ఉండబోతోంది అన్నదే ఇపుడు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కీలక నేతలకు కలుగుతున్న ధర్మ సందేహంగా ఉందిట. మరి జగన్ మీటింగ్ అంటేనే ఫుల్ ప్రిప్రేర్డ్ గా ఉంటారు. గడప గడపకు తిరుగుతున్న ఎమ్మెల్యేలు ప్రిపేర్డ్ గా లేకపోతే ఆరు నెలల ముందే అభ్యర్ధులను ఖరారు చేస్తాను అంటున్న జగన్ ఆ లిస్ట్ లో తమ పేరు ఉంచుతారా లేదా అన్న టెన్షన్ అయితే ఉందిట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.