Begin typing your search above and press return to search.
అతి పెద్ద కులంతో పొత్తు పెట్టుకుంటున్న జగన్
By: Tupaki Desk | 18 Dec 2022 3:30 AM GMTకులం లేని సమాజం లేదు మతం లేని ప్రపంచం లేదు. రాజకీయాల్లో ఈ రెండూ లేకుండా కధ సాగదు. ఇక ఏపీ లాంటి రాష్ట్రాలలో కులాల సంకుల సమరం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఫలానా కులం వారికి ఫలానా పదవి ఇచ్చామని బాహాటంగా చెప్పుకుని దాన్ని రాజకీయ లాభంగా మార్చుకుంటున్న నాయకులను చూసి జనాలు కూడా ఆ మాటలను వినేందుకు అలవాటు పడ్డారు.
మా కులానికి పదవి ఎందుకు ఇవ్వలేదు అని కార్తీక సమారాధనల్లో సైతం డిమాండ్ చేసే స్థాయిలో తలలు పండిన రాజకీయ నాయకులు ఉన్న కాలమిది. ఇదిలా ఉంటే ఏపీలో వచ్చే ఎన్నికల్లో మాది అతి పెద్ద జనాభా కలిగిన కులం, అందువల్ల మాకు రాజ్యాధికారం కావాలని కాపులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. జనసేన తాను కాపులకు ప్రతినిధిగా చెప్పుకోకపోయినా ఆ పార్టీని ఆ వర్గం సొంతం చేసుకుంటోంది.
వచ్చే ఎన్నికల నాటికి అది మరింత స్పష్టంగా రాజకీయ తెర ముందుకు వస్తుంది. తెలుగుదేశం కూడా బీసీల పార్టీ తమదని చెబుతోంది. అలాగే కాపులను తన వైపునకు తిప్పుకుంటోంది. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు,ఎస్టీలు ఉన్నారు. మతం వైపు చూస్తే మైనారిటీలు ఉన్నారు. వీరిని తమ వైపునకు తిప్పుకుని సోషల్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా గెలుపు పిలుపు వినాలని వైసీపీ పరితపిస్తోంది. అయితే కాపుల డిమాండ్లు అతి పెద్ద సామాజికవర్గంగా వారు ఉండడం, పవన్ లాంటి చరిష్మాటిక్ లీడర్ నేతృత్వంలోని జనసేన కూడా అందుబాటులో ఉండడంతో వైసీపీలో ఈ కులాల ఈక్వేషన్స్ మీద ఇంకా కొంత తెలియని కలవరం ఉంది అని అంటున్నారు.
అందుకే ఈ మధ్య వైసీపీ అధినాయకుడు జగన్ సరికొత్త స్లోగన్ ని అందుకున్నారు. ఆయన జిల్లాల టూర్లలో మా ఎస్టీలు, మా ఎస్సీలు, మా బీసీలు, మా మైనారిటీలు అని అంటూ వస్తున్నారు. అంతే కాదు చాలా కాలంగా ఆయన మరో మాట కూడా అంటున్నారు. అదేంటి అంటే పేదలకు మా ప్రభుత్వం ఎంతో మేలు చేస్తూంటే డబ్బున వారు పెత్తందారులూ చూసి ఓర్వలేకపోతున్నారు అని.
పేదలను పైకి తీసుకురావడానికి వైసీపీ చూస్తోందని, వైసీపీ వారికి నేరుగా నగదు ఖాతాల్లో వేసి మంచి చేస్తోందని, అదే టీడీపీ అయితే తమ వారికే దాచి పెట్టి దోచిపెట్టిందని కూడా ఆరోపణలు చేశారు. ఇక ఇపుడు జగన్ దాన్నే మరి కాస్తా మార్చి కొత్త కులాని క్రియేట్ చేశారు. అదే పేదకులం. ఆయన తాజాగా పార్టీ వర్క్ షాప్ లో మాట్లాడుతూ ఏపీలో పేదల కులం పెద్దల కులం అని రెండే ఉన్నాయని లెక్క తేల్చేశారు.
ఉన్నవి ఈ రెండే కులం తప్ప మరేమీ లేవని అంటున్నారు. పెత్తందారులు పేద కులాన్ని అణగతొక్కాలని చూస్తూంటే అండగా వైసీపీ నిలబడిందని, వైసీపీ పొరపాటున కనుక అధికారంలోకి రాకపోతే పేదలు తీవ్రంగా అన్యాయం అయిపోతారని జగన్ చెప్పుకొచ్చారు. చెప్పడానికి పార్టీ ఎమ్మెల్యేలకు అని కనిపిస్తున్న దీని వెనక జగన్ బ్రహ్మాండమైన ప్లాన్ ఉందని అర్ధమవుతోంది అంటున్నారు.
పేదలు ఏపీలో నూటికి ఎనభై శాతం ఉన్నారు. అన్ని కులాల్లోనూ పేదలు ఉన్నారు. దాంతో జగన్ ఏకంగా పేదలందరికీ ఒకే కులమని చెబుతూ ఆ కులం తమదని గట్టిగా చాటుకుంటున్నారు. తాము పేదల కోసం పాటుపడుతూంటే దుష్ట చతుష్టయం అడ్డుకుంటోందని ఆయన అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మార్క్ నినాదం ఇదే అని కూడా అర్ధమవుతోంది. కాపులు కావచ్చు, బీసీలు కావచ్చు, మరో కులం కావచ్చు. పేదలు అంతా ఒకే కులం అదే తమ కులం అని వైసీపీకి మద్దతుగా ఆ కులాన్ని పెట్టుకుని జగన్ రేపటి ఎన్నికల్లో యుద్ధం చేయబోతున్నారు అన్న మాట.
మహామంత్రి తిమ్మరుసు మాదిరిగా జగన్ ఇపుడు ఏపీలో కుల రాజకీయాన్ని చిన్నది చేయడం కోసం పెద్ద గీత గీశారని చెప్పవచ్చు. పేదకులానికి తాను అండగా ఉంటానని, వారి మద్దతు తమకు ఉంటుందని జగన్ చెప్పుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కుల సంకుల సమరాన్ని కులాల ప్రాతిపదికగా ఓట్లు గుంజుకోవాలనుకే ప్రత్యర్ధుల ఎత్తులకు చెక్ చెప్పనున్నారు అన్న మాట. అంటే అన్ని కుల్లాల్లోని పేదల ఓట్లు గుత్తమొత్తంగా వైసీపీకి టర్న్ అయ్యే విధంగా చేసుకునే మాస్టర్ ప్లాన్ అన్న మాట. మొత్తానికి జగన్ పేదరికం, పేద కులం పెత్తందారులు అంటూ చేస్తున్న ఈ ప్రచారం వెనక చాలా వ్యూహాలు ఉన్నాయి. ఇది కనుక జనంలోకి వెళ్తే ఏపీలో ఇపుడు సాగుతున్న కులాల సంకుల సమరం కొత్త మలుపు తిరగడం ఖాయం. అపుడు అది విపక్షాలను వీక్ చేయడమూ ఖాయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.