Begin typing your search above and press return to search.
మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేసిన జగన్
By: Tupaki Desk | 15 Aug 2020 7:50 AM GMTగడిచిన కొద్ది రోజులుగా ఏపీలోని మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఓవైపు కరోనా వేళ.. కిందామీదా పడుతున్న మూడు రాజధానుల వ్యవహారం ఏపీలో రాజకీయ అంశంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మూడు రాజధానులపై అధికార.. విపక్షనేతలు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అట్టే మాట్లాడని పరిస్థితి.
ఆ మాటకు వస్తే.. అప్పుడెప్పుడో రెండుసార్లు మాత్రమే మూడురాజధానులపై మాట్లాడారు సీఎం జగన్. ఆ తర్వాత ఆయన ఎప్పుడు మాట్లాడింది లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. పంద్రాగస్టు నేపథ్యంలో జాతీయ జెండానుఆవిష్కరించిన ఆయన.. తన ప్రసంగంలోమూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన గాయాలు మానాలన్నా.. అలాంటి గాయాలు మరోసారి తగలకూడదన్నా ఏపీ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న ఆయన.. అందుకు వికేంద్రీకరణే సరైనదన్నారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మూడురాజధానుల బిల్లులను చట్టంగా మార్చిన విషయాన్ని వెల్లడించారు. త్వరలో విశాఖకేంద్రంగా కార్యనిర్వాహఖ రాజధాని.. కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధానికి పునాదులు వేస్తామని జగన్ పేర్కొన్నారు.