Begin typing your search above and press return to search.

హైకోర్టులో తేల్చుకోబోతున్న సీఎం జగన్ ..

By:  Tupaki Desk   |   1 Nov 2019 11:48 AM GMT
హైకోర్టులో తేల్చుకోబోతున్న సీఎం జగన్ ..
X
మనకి న్యాయం జరగకపోతే .. న్యాయం జరిగే వరకు పోరాడాలి అని పెద్దలు చెప్పే మాటలని ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో వినే ఉంటారు. దీన్ని ఇప్పుడు సీఎం జగన్ ఆచరణలో పెట్టి చూపిస్తున్నాడు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ..ప్రజల అవసరాలని తీరుస్తూనే మరో వైపు తన పై ఉండే అక్రమాస్తుల కేసులపై తన నిజాయితీని నిరూపించుకోవడానికి పోరాడుతున్నారు.

దివంగత నేత - మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత జగన్ కి ఉన్న ప్రజా మద్దతుని చూసి ఓర్వలేక లేనిపోని కేసులు జగన పై అక్రమంగా పెట్టి జైలు శిక్ష అనుభవించేలా చేసారు. సాయంత్రం అస్తమించే సూర్యడు ..పొద్దున్నే ఎలా ఉదయిస్తాడో .. జగన్ కూడా అదే రేంజ్ లో జైలు నుండి వచ్చి రాష్ట్ర రాజకీయాలలో కొత్త చరిత్ర సృష్టించాడు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరు సాధించలే నటువంటి భారీ మెజారిటీ స్థానాలని కైవసం చేసుకొని .. ఆంధ్రప్రదేశ్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసారు. ఇకపోతే తన నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రతి శుక్రవారం తప్పకుండ నాంపల్లి లోని సిబిఐ కోర్టుకి వస్తూనే ఉన్నారు.

ఇక ప్రస్తుతం జగన్ ఒక సాధారణ పౌరుడు కాదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సిబిఐ కోర్టు చెప్పినట్టు చట్టం ముందు అందరూ సమానమే కానీ , రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో భాద్యతలు సీఎం జగన్ పై ఉన్నాయి. దీనితో వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనికి సిబిఐ వారు ..జగన్ ప్రధాన ముద్దాయి కాబట్టి వ్యక్తిగత మినహాయింపు ఇస్తే సాక్షాలని తారుమారు చేస్తారని చెప్పుకొచ్చారు. సిబిఐ వారి వాదనలతో ఏకీభవించిన నాంపల్లి సిబిఐ కోర్టు సీఎం జగన్ వేసిన పిటిషన్ ని తోసిపుచ్చింది. దీనితో జగన్ తరపు లాయర్లు దీన్ని సవాల్ చేస్తూ హై కోర్ట్ లో పిటిషన్ వేశారు. హై కోర్టు ఎటువంటి తీర్పు చెప్తుందో అని ప్రజలందరు చర్చించుకుంటున్నారు.