Begin typing your search above and press return to search.

9121091210 మిస్డ్ కాల్ ఇవ్వ‌మ‌న్న జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   3 Sep 2017 5:10 AM GMT
9121091210 మిస్డ్ కాల్ ఇవ్వ‌మ‌న్న జ‌గ‌న్‌
X
ఏపీ విప‌క్ష నేత కొత్త నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలో నిత్యం మ‌మేక‌మ‌య్యే ఆయ‌న తాజాగా మ‌రో కొత్త త‌ర‌హా నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ప్ర‌జ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల గురించి తెలుసుకోవ‌టం కోసం ఒక ఫోన్ నెంబ‌రును ప్ర‌క‌టించారు.

స‌మ‌స్య‌ల్లో ఉన్న వారు.. ఇబ్బందులు ఎదురైన వారు 9121091210 కు మిస్డ్ కాల్ ఇవ్వాల‌న్నారు. అలా చేస్తే.. వారి స‌మ‌స్య‌లు ఇబ్బందులు తెలుసుకుంటామ‌ని.. తాము అధికారంలోకి రాగానే వాటి ప‌రిష్కారం మీద దృష్టి పెట్ట‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

సెప్టెంబ‌రు 11 నుంచి అక్టోబ‌రు 2 వ‌ర‌కు వైఎస్సార్ కుటుంబం కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. ఇందులో భాగంగా బూత్ క‌మిటీ స‌భ్యులు ప్ర‌తి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ స‌భ్యుల‌తో 20 నిమిషాల పాటు గ‌డ‌పాల‌ని వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవాల‌న్నారు.

బాబు పాల‌న మీద మార్కులు వేయించాల‌ని కోరిన జ‌గ‌న్‌.. తాజా కార్య‌క్ర‌మంతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దిమ్మ తిరిగిపోవాల‌న్నారు. త‌మ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా బూత్ క‌మిటీ స‌భ్యులు తాము క‌లిసి వారి చేత 9121091210 నెంబ‌రుకు మిస్డ్ కాల్ ఇప్పించాల‌న్నారు. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే యుద్ధ ప్రాతిప‌దిక‌న వారి స‌మ‌స్య‌ల పరిష్కారం మీద దృష్టి పెడ‌తాన‌న్నారు. ప్ర‌తి గ్రామంలోనూ సెక్ర‌టేరియ‌ట్‌ను ఏర్పాటు చేస్తామ‌ని.. తెలుగుదేశం పాల‌న‌కు త‌మ పాల‌న భిన్నంగా ఉంటుంద‌న్నారు.

ఫించ‌ను కోసం.. ప‌క్కా గృహం కోసం అధికారుల చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేద‌ని.. జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను కాకా ప‌ట్ట‌టం లాంటివేమీ ఉండ‌వ‌న్నారు. అక్టోబ‌రు 27 నుంచి ఆర్నెల్ల పాటు పాద‌యాత్ర జ‌ర‌ప‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. త‌న పాద‌యాత్ర ముగిసే నాటికి బాబు దుష్ట పాల‌న చివ‌ర్లోకి వ‌చ్చి ఉంటుంద‌న్నారు.