Begin typing your search above and press return to search.

జగన్ రివర్స్ అప్పీల్...జనం రియాక్షన్ ఏంటి...?

By:  Tupaki Desk   |   26 Feb 2023 9:12 AM GMT
జగన్ రివర్స్ అప్పీల్...జనం రియాక్షన్ ఏంటి...?
X
సాధారణంగా రాజకీయ నాయకులు ఓట్లను అడిగేందుకు వచ్చినపుడు మాకు ఓటేయండి అనే అంటారు. మేము ఏదో చేస్తామని చెబుతారు. హామీలు ఇస్తారు. అయితే 2024లో జరిగే ఎన్నికలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓట్లను అడిగే తీరులో కూడా ఒక ప్రత్యేకతను తీసుకువస్తున్నారు. మేము జనాలకు మేలు చేస్తున్నామని అనుకుంటే ఓటేయండి అన్నదే జగన్ నుంచి వెళ్ళే అప్పీల్.

అంటే మేము ఇచ్చిన హామీల మేరకు అన్నీ నెరవేర్చాం, పధకాలను సవ్యంగా అమలు చేశాం, పధకాల అమలులో అవినీతికి ఎక్కడా తావు లేకుండా చూశాం, నేరుగా నగదు బదిలీ పధకం ద్వారా లబ్దిదారును ఖాతాలోకే సొమ్ము చేరేలా చూశామని జగన్ అంటున్నారు. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ లబిదారుడికి సొమ్ము చేరుతోంది. ఇంతకంటే పారదర్శకత ఎక్కడ ఉంటుంది. ఈ విధానాన్ని మేము అమలు చేశాం, అందువల్ల మాకు ఓటేయండి అని జగన్ అడగబోతున్నారు.

అది కూడా మేము చేసిన మేలు మీకు అందిందని, అది జరిగిందని మీరు భావిస్తేనే వైసీపీకి ఓట్లేయండి అని జగన్ అంటున్నారు. తాజాగా జగన్ డీసీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వడం మారచిపోవడం చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. తాను మాత్రం చెప్పిన ప్రతీ మాటను గుర్తు చేసుకుంటూ దాన్ని అమలు చేశాను అని ఆయన పేర్కొన్నారు.

తాను రైతు భరోసా రైతు భీమా వంటి పధకాలను అమలు చేయడం ద్వారా రైతు కుటుంబాలలో ఆందం కలిగించాను అని ఆయన అన్నారు. అలాగే అనేక సంక్షేమ పధకాలను రూపకల్పన చేయడం వెనక ఉద్దేశ్యం పేదలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ఆశించడమే అని ఆయన అన్నారు. తాము అన్ని రకాలుగా అధ్యయనం చేసిన మీదటనే పధకాలను అమలు చేస్తున్నామని అన్నారు.

పేదరికం లేకుండా ప్రజలు బయటపడాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. తాను చెప్పిన ప్రతీ మాటను గుర్తుంచుకున్నాను మరచిపోలేదని ఆయన చెప్పారు. జగన్ ఈ విధంగా జనం మీదనే అన్నీ వదిలేస్తామని వారు మేలు చేశారు అని అనుకుంటే ఓటేయాలని అప్పీల్ చేయడం నిజంగా కొత్త ప్రయోగమే. మాకే ఓట్లేయండి మేము అంతా చేశామని గట్టిగా దబాయించి చెప్పినా ఓటేయని రోజులు ఇవి.

అలాంటిది జగన్ డేరింగ్ గా మీకు మేలు జరిగిందంటేనే ఓటేయండి అంటే జనాలకే ఆప్షన్ ఇచ్చినట్లు అవుతుంది. అపుడు జనాల రియక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నదే ఆలోచించాలని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ చేసే ప్రచారం ఇదే అని అంటున్నారు. దీని మీద వైసీపీ నాయకులు కూడా జగన్ కొత్త స్లోగన్ కరెక్ట్ గానే రీచ్ అవుతుందని అంటున్నారు. టార్గెట్ ని అది చేదిస్తుంది అంటున్నారు.

మా నాయకుడు నమ్మకంతోనే ఈ స్లోగన్ ఇస్తున్నారని, మేము చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చామని అందువల్లనే డేరింగ్ గా జనంలోకి వెళ్ళి చెప్పగలుగుతున్నామని అంటున్నారు. ఒక వైపు విపక్షం అయితే ఏపీలో వైసీపీ ఏమీ చేయలేదని చెబుతోంది. దాన్ని కౌంటర్ చేయాలంటే తాము చేసినది చెప్పుకోవాలి. మేమే అంతా చేశామని మాకే ఓటేయండి అని క్లెయిం చేయాలి. అయితే జనాలకే అంతా వదిలిపెడితే వారే ఆలోచించుకుంటారు అన్నది రివర్స్ అప్పీల్ గానే చూడాలని అంటున్నారు. మరి ఇది ఎంతవరకూ జనాలకు కనెక్ట్ అవుతుంది అన్నది 2024లోనే తేలే విషయం.