Begin typing your search above and press return to search.

రాజధాని మార్పు నేపథ్యం: జగన్ నిర్ణయం పై ఉత్కంఠ

By:  Tupaki Desk   |   20 Jun 2020 9:10 AM GMT
రాజధాని మార్పు నేపథ్యం: జగన్ నిర్ణయం పై ఉత్కంఠ
X
2015లో కట్టుబట్టలతో హైదరాబాద్ ను విడిచి అమరావతికి రాజధాని మార్చిన చంద్రబాడు నాడు సచివాలయ ఉద్యోగులకు వసతి, పిల్లల చదువులు, సచివాలయంలో అస్తవ్యస్థ మౌళిక సదుపాయల నేపథ్యంలో 5 రోజులు మాత్రమే పని కల్పించారు. శని, ఆదివారాలు సెలవులు ఇచ్చారు. దీంతో ఉద్యోగులు సోమవారం ఉదయం లేటుగా ఆఫీసుకు వచ్చి శుక్రవారం మధ్యాహ్నమే తట్టాబుట్టా సర్దేసుకొని హైదరాబాద్ వెళ్లిపోయేవారు. దీంతో చంద్రబాబు ఐదురోజుల పని కాస్తా కేవలం నాలుగున్నర రోజులకే పరిమితమైంది.

అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక కూడా అమరావతిలో వసతులు, విద్యాసంస్థలు, మౌలిక సదుపాయల కొరత దృష్ట్యా సచివాలయ ఉద్యోగులకు 5 రోజుల పనివేళలను ఏడాదిపాటు కొనసాగిస్తూ వెసులుబాటు కల్పించారు. ఈ నెల 27తో ఆ గడువు ముగియబోతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మరోసారి ఉద్యోగులకు వెసులుబాటు ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

ప్రస్తుతం సీఎం జగన్ విశాఖపట్నానికి రాజధాని తరలించాలని యోచిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఇన్నాళ్లు అప్ అండ్ డౌన్ చేసిన సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు విశాఖకు అప్ అండ్ డౌన్ చేయడం కష్టం. 8 నుంచి 9 గంటల పాటు వారి రాకపోకలకు సమయం పడుతుంది. దీంతో ఖచ్చితంగా విశాఖలోనే ఉండాలి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సచివాలయ ఉద్యోగులంతా విశాఖకు మారాలని.. ఇక నుంచి 5 రోజుల పనిదినాలను ఎత్తి వేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది.

జగన్ ప్రభుత్వం నవరత్నాలు సహా సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ ప్రజల్లో పెద్ద ఎత్తున పరిపాలన సంస్కరణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఐదురోజుల పనితో ప్రభుత్వ పాలనకు ఆటంకాలు కలుగుతున్నాయి. అందుకే ఆరు రోజుల పని విధానం పొడిగించి రాజధానిని విశాఖ కు తరలించి పూర్తి స్థాయిలో పాలనను పరుగులు పెట్టించాలని యోచిస్తున్నారట.. రాజధాని తరలింపు లేట్ అయితే ఈ ఆరు రోజుల పొడగింపు అమలు చేస్తారా లేక ఉద్యోగులకు వెసులుబాటు ఇస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.