Begin typing your search above and press return to search.

కాజా టోల్ ఘటనపై జగన్ సీరియస్

By:  Tupaki Desk   |   12 Dec 2020 4:31 PM IST
కాజా టోల్ ఘటనపై జగన్ సీరియస్
X
గుంటూరు-విజయవాడ మధ్య శుక్రవారం ఉదయం కాజా టోల్ ప్లాజా దగ్గర వైసీపీ నేత దేవళ్ళ రేవతి వేసిన వీరంగంపై జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. టోలుగేటు దగ్గర 100 రూపాయల ఫీజు కట్టకుండా ఫ్రీగా వెళ్ళాలన్న వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ళ రేవతి చూపిన అత్యుత్సాహం పార్టీతో పాటు జనాల్లో కూడా సంచలనమైంది. 100 రూపాయల టోలు ఫీజు కట్టే విషయంలో ప్రిస్టేజికి పోయిన రేవతి ఫీజు కట్టకుండానే టోలు గేటు నుండి వెళ్ళేందుకు ప్రయత్నించారు.

అయితే టోలు ఫీజు కట్టకుండా వాహనం వెళ్ళేందుకు లేదని టోలుప్లాజా సిబ్బంది రేవతిని అడ్డకున్నారు. దాంతో తన వాహనంలో నుండి దిగిన ఆమె తన వాహనానికి అడ్డుపెట్టిన బ్యారికేడ్లను కిందపడేశారు. ఓ బ్యారికేడును పక్కకు తోసేసి వెళ్ళటానికి ప్రయత్నించారు. తన ప్రయత్నాన్ని అడ్డుకున్న సిబ్బందిని కొట్టారు. ఇదంతా సీసీ ఫుటేజీలో రికార్డయింది.

ఎప్పుడైతే రోడ్డుపై రేవతి వీరంగం తాలూకు వీడియోలు బయటకు వచ్చాయో వెంటనే వైరల్ గా మారింది. వీడియోలను చూసిన సీనియర్ నేతలు తలలు పట్టుకున్నారు. దీనికి అదనంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా రేవతిని తప్పుపడుతు పోస్టలు పెట్టారు. దాంతో విషయం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళిందట. మొత్తం వీడియో క్లిప్పింగులను చూసిన జగన్ రేవతి తీరుపై బాగా సీరియస్ అయ్యారట. 100 రూపాయల టోలు పీజు చెల్లించే విషయంలో అధికారపార్టీ నేతలు గొడవలు పడటం ఏమిటంటే మండిపోయారట.

అధికారపార్టీ అన్న అహకారంతో నేతలు తమిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే జనాల్లో పలుచనై పోతామన్న స్పృహ కూడా లేకపోతే ఎలాగంటూ నిలదీశారట. రేవతిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింతమంది నేతలు ఇదే పద్దతిలో రెచ్చిపోయే ప్రమాదం ఉందని జగన్ భివించినట్లు పార్టీ నేతలంటున్నారు. మరి తొందరలోనే ఛైర్ పర్సన్ గా బాధ్యతలు తసుకోబోయే రేవతిపై జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఇపుడు ఆసక్తిగా మారింది.