Begin typing your search above and press return to search.
ఇంత చేసినా.. ఆ ఒక్కటీ.. జగన్‌ను రోడ్డున పడేస్తోందిగా..!
By: Tupaki Desk | 11 Dec 2021 2:00 PM ISTఏపీ సీఎం జగన్ తన రెండున్నర సంవత్సరాల పాలనలో ఎంతో చేశారు. ఎంతో మందికి పదవులు ఇచ్చారు . అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదల చేతుల్లోకి డబ్బులు వెళ్లేలా కూడా చేశారు.
నిజానికి ఇది సంచలనమే. ఎందుకంటే.. తమకు రాజకీయాలు తెలుస్తాయా? తమకు ఈ పదవులు దక్కుతాయా? అసలు ఈ పదవులు ఉన్నాయా? అని కూడా తెలియని.. అనేక మంది మహిళలకు.. ఆయన పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీలను చేశారు. కౌన్సిలర్లను చేశారు. జడ్పీ చైర్మన్‌లను కూడా చేశారు. అణగారిన వర్గాలకు ఎంతో అవకాశం కల్పించారు.
అయితే.. ఇంత చేసినా.. జగన్ మరోసారి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం.. ఆయన గత ఎన్నికల్లో ఇచ్చిన హామీనే! సదరు హామీని నెరవేర్చకపోవడమే! తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఫ్యామిలీ.. జగన్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది.
మాట ఇచ్చి తప్పారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. తమ డబ్బును.. పరపతిని కూడా వినియోగించి.. పార్టీ కోసం.. సేవ చేస్తే.. ఇప్పుడు మాకు జగన్ మోసం చేశారంటూ.. మర్రి రాజశేఖర్ బావమరిది.. వెంకట సుబ్బయ్య.. బహిరంగ సభలోనే నిప్పులు చెరిగారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. అయితే.. దీనిని అటు వైసీపీ నాయకులు ఇటు.. జగన్ అభిమానులు కూడా ఖండించలేని పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో పేట టికెట్‌ను రజనీ కోసం త్యాగం చేయమని అడిగింది జగనే.
అంతేకాదు.. అక్కడే సభా ముఖంగా మర్రి రాజశేఖర్ చేయి పట్టుకుని.. `మన ప్రభుత్వం రాగానే.. మర్రి అన్నకు ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి పదవిని కూడా అప్పగిస్తాం`` అని మాట ఇచ్చింది జగనే! కానీ.. ఇప్పటికీ.. ఈ హామీ నెరవేరలేదు.
ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు మౌనంగా ఉన్న మర్రి కుటుంబం ఇప్పుడు తొలిసారి.. రోశయ్య నివాళి కార్యక్రమంలో బయటపడిపోయింది. మరి ఎంతో మందికి అవకాశాలు ఇచ్చిన జగన్ .. ఇప్పటికైనా మర్రికి ఒక పదవి ఇస్తే.. మాట తప్పారు అనే అపవాదు నుంచి బయట పడొచ్చు కదా..! ఇందులో పంతం ఎందుకు? పైగా మర్రి కూడా వివాద రహితుడు.. వైఎస్‌కు అభిమాని కూడా! అని చెబుతున్నారు. చిన్న పనితో పెద్ద అపవాదు నుంచి బయట పడే ఛాన్స్ ఉందిగా అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి .