Begin typing your search above and press return to search.
జగన్ ఈసారి ఒంటరి కాదు... ?
By: Tupaki Desk | 3 Oct 2021 9:00 PM ISTఏపీ రాజకీయాల్లో వైసీపీది ప్రత్యేకమైన స్థానంగా చెప్పుకోవాలి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒంటరిగానే ఉంటోంది. తన రాజకీయం తానూ అన్నట్లుగానే వైసీపీ అడుగులు వేస్తోంది. నిజానికి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనకంటూ కొందరు మిత్రులు ఉండాలి. ఇది పక్కా రాజకీయ వ్యూహం. కానీ వైసీపీ మాత్రం అందరికీ ఒకే గాటన కట్టేసి సోలోగానే పాలిటిక్స్ చేస్తూ వస్తోంది. అదే టైమ్ లో ఏపీలో టీడీపీ పొత్తుల గురించి చెప్పుకోవాలంటే చాలానే కధ ఉంది. ఆ పార్టీ 1983లోనే సంజయ్ విచార్ మంచ్ తో పొత్తు పెట్టుకుంది. ఆ తరువాత బీజేపీ, వామపక్షాలు ఇలా వీలు కుదిరినపుడల్లా మారుస్తూ వెళ్తోంది. ఇక చంద్రబాబు జమానాలో అయితే టీయారెస్ తో కూడా పొత్తు పెట్టుకుని అందరికీ ఆశ్చర్యపరచిన చంద్రబాబు 2018 ఎన్నికల వేళ తెలుగు తమ్ముళ్ళకే షాక్ ఇస్తూ తెలంగాణాలో కాంగ్రెస్ తో కూడా చేతులు కలిపారు.
ఇవన్నీ పక్కన పెడితే 2024 ఎన్నికల్లో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, సింహం సింగిల్ గానే బరిలో ఉంటుంది అంటూ వైసీపీ మంత్రులు నేతలు ఇప్పటికే ఆర్భాటంగా అనేక ప్రకటనలు చేస్తున్నారు. కానీ వైసీపీ ఈసారి ఒంటరిగా పోటీ చేయదు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఈసారి వైసీపీ సీపీఎం తో పొత్తు పెట్టుకుని ముందుకు వస్తుంది అంటున్నారు. నిజానికి ఇది కొత్త మాట కూడా కాదు, 2014 ఎన్నికల వేల వామపక్షాలు, బీజేపీ కూడా జగన్ తో పొత్తులకు ప్రయత్నం చేశాయి. నాడు జగన్ ఎందుకో కాదనుకున్నారు. ఇక 2019 ఎన్నికల వేళ కూడా ఇదే రకమైన ప్రతిపాదనలు వెళ్లాయి అంటారు. కానీ జగన్ మాత్రం నో చెప్పేశారు. మరి నాడు లేనిది నేడు ఎందుకు అన్న మాట అయితే ఉంది. దానికి జవాబు కూడా ఉంది.
సీపీఎం అంటే జగన్ కి ఎందుకో ప్రత్యేకమైన గౌరవం అంటారు. అలాగే సీపీఎం విమర్శలు కూడా అర్ధవంతంగా ఉంటాయని చెబుతారు. చిల్లర రాజకీయాలు చేయకుండా సిద్ధాంతపరంగానే విమర్శలు చేసే కామ్రెడ్ పార్టీగా సీపీఎం కి విలువ మర్యాద ఉన్నాయి. అంతే కాదు, విజయవాడ, విశాఖ వంటి చోట్ల సీపీఎం కి చాలానే బలం ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులూను అధిగమించాలి అంటే సీపీఎం తో జత కట్టడం మంచిది అని వైసీపీ అగ్ర నాయకత్వం భావిస్తోందిట. ఇక్కడ వైసీపీకి అధికారం కోసం ఈ పొత్తు కాదని కూడా అంటున్నారు. ఎవరితో పొత్తు లేకపోయినా తాము పవర్ లోకి రాగలమన్న నిబ్బరాన్ని వైసీపీ ప్రదర్శిస్తోంది. అదే సమయంలో తమకు కొంత నైతిక మద్దతుగా నిలిచే రాజకీయ పక్షం కూడా కావాలన్నదే ఈ మధ్యన ఆ పార్టీ కొత్తగా తెలుసుకున్న సత్యం అంటున్నారు.
అందుకే సీపీఎం లాంటి పార్టీలతో ముందుకు సాగితే ఇతర విపక్షాలు చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టగలమని కూడా భావిస్తున్నారు. పేదలకు న్యాయం చేయలన్నదే వామపక్ష అజెండా. ఏపీలో కూడా వైసీపీ సంక్షేమ కార్యక్రమల పేరిట చేస్తోంది అదే. దాంతో ఈ భావజాలమే సీపీఎం తో పొత్తుకు మొగ్గలు వేసింది అంటున్నారు. ఇక విశాఖలో ఈసారి పోరు మాములుగా ఉండదు, అక్కడ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించడానికి బీజేపీ రెడీ అవుతోంది. ఆ నేపధ్యంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ వస్తున్న సీపీఎం లాంటి పార్టీలతో దోస్తీ కడితే 2024 ఎన్నికల వేళ మోరల్ గా సపొర్ట్ ఉంటుంది అని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారుట.
అలాగే విజయవాడ సహా చాలా చోత్ల సీపీఎం కి సాలిడ్ ఓట్లు ఉన్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు ఆ పార్టీకి కేటాయించడం ద్వారా మంచి మిత్రుడిని చేసుకోవాలని వైసీపీ భావిస్తోందిట. అంటే ఏపీలో వచ్చే ఎన్నికలు పార్టీల మధ్య కాదు కూటముల మధ్య సాగుతాయని అనుకోవాలి. టీడీపీ జనసేన, బీజే ఒక వైపు ఉంటే వైసీపీ సీపీఎం కూటమి మరో వైపు ఉంటాయన్న మాట. మరి ఈ రకమైన పోరులో ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది కూడా చూడాలి.