Begin typing your search above and press return to search.

టీడీపీ ఖేల్ ఖతం చేసే ప్లాన్..మోడీతో కీలక భేటికి జగన్ రెడీ!

By:  Tupaki Desk   |   3 Oct 2020 5:32 PM GMT
టీడీపీ ఖేల్ ఖతం చేసే ప్లాన్..మోడీతో కీలక భేటికి జగన్ రెడీ!
X
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కావడానికి ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే వారం మరోసారి న్యూఢిల్లీకి వెళుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. సెప్టెంబరు చివరి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ఇతరులను కలవడానికి ఇటీవల ఢిల్లీలో పర్యటించారు. అప్పుడు ప్రధాని మోడీని కలవలేకపోయారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్.. ప్రధాని మోడీతో భేటికి అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. ఈ మేరకు భేటికి త్వరలో తేది నిర్ణయించారని పిఎంఓ నుండి ఏపీ సీఎం కార్యాలయానికి సమాచారం వచ్చినట్లు సమాచారం.

తాజా నివేదికల ప్రకారం.. అక్టోబర్ రెండోవారంలో మోడీతో జగన్ అపాయింట్‌మెంట్ ఉండవచ్చని పిఎంఓ నుండి సమాచారం వచ్చినట్టు సమాచారం. సహజంగానే వీరి భేటి చాలా ఊహాగానాలను దారితీసింది. రాష్ట్ర సమస్యలపై జగన్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళుతారని సమాచారం. ఇటీవలి పర్యటనలో అమిత్ షాకు సాధారణ సమస్యలే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

పోలవరం నిధుల విడుదలపై చర్చించడానికి ముఖ్యమంత్రి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు. ఆదాయ లోటు, జీఎస్టీ పరిహారం కింద బకాయిలు కోరాలని ఆయన రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. కాబట్టి.. మోడీతో జగన్ సమావేశం పూర్తిగా వ్యక్తిగత.. రాజకీయ కోణంలో ఉంటుందని భావిస్తున్నారు.

ఇక వైసీపీ.. కేంద్రంలో భాగస్వామిగా చేరబోతోందని.. ఎన్డీఏలో చేరడానికే ఈ చర్చలు ఉంటాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అది కార్యరూపం దాల్చినట్లయితే, జాతీయ రాజకీయాల్లో అతి పెద్ద రాజకీయ స్టెప్ గా అభివర్ణిస్తున్నారు.

మోడీతో భేటిలో కీలక విషయాలను జగన్ ప్రస్తావించనున్నట్టు సమాచారం. అమరావతి భూ కుంభకోణం మరియు ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంపై సిబిఐ విచారణ చేయించాలని జగన్ కోరనున్నట్టు సమాచారం.టీడీపీని షేక్ చేసేందుకు మోడీని జగన్ కోరబోతున్నట్టు సమాచారం. తద్వారా రాబోయే సంవత్సరాల్లో రాష్ట్రంలో టీడీపీని తుత్తునియలు చేసి రాజకీయ వ్యతిరేకత లేకుండా చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నాడు.