Begin typing your search above and press return to search.
మార్చటం కాదు.. పార్టీకి త్రిమూర్తుల్ని తేల్చేసిన జగన్
By: Tupaki Desk | 29 Dec 2021 10:00 PM ISTకొంతకాలంగా సాగుతున్న చర్చకు పుల్ స్టాప్ పెట్టేలా వ్యవహరించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటీవల కాలంలో వైసీపీ ఇన్ ఛార్జులను మార్చేస్తున్నట్లుగా.. కొత్త వారిని తెర మీదకు తీసుకొస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
అలాంటి వాదనలకు చెక్ చెప్పటమే కాదు.. ఇప్పుడు ఉన్న ఇన్ చార్జిలకు మరిన్ని అదనపు బాధ్యతల్ని అప్పగించటం ద్వారా.. పార్టీలో ఆ ముగ్గురే సుప్రీం అన్నట్లుగా తేల్చేశారు. దీంతో.. ఇన్ చార్జిలుగా కొత్త వారు వస్తారన్న దానిలో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది.
ఇప్పటికే ఇన్ చార్జిలుగా ఉన్న వారికి అదనపు బాధ్యతల్ని అప్పజెప్పటం చూస్తే.. పార్టీ మొత్తం అధినేత జగన్ తర్వాత ఆ ముగ్గురు కనుసన్నల్లోనే ఉంటుందన్న విషయాన్ని తేల్చి చెప్పారని చెప్పాలి. ప్రస్తుతం ఉత్తరాంధ్రకు విజయసాయి.. ఉభయ గోదావరి జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డి.. సీమకు సజ్జల ఇన్ ఛార్జిలుగా వ్యవహరిస్తున్నారు. వీరిని మారుస్తారన్న ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే ఇటీవల ఇన్ ఛార్జిల అంశం వైఎస్ జగన్ వద్ద చర్చ సాగినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా అధినేత తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఇన్ ఛార్జిలుగా ఉన్న వారిని మార్చటం తర్వాత.. ఉన్న వారిని మరింత బలోపేతం చేసేలా నిర్ణయం ఉండటంతో పాటు..పార్టీలో వారి స్థానం ఎంతన్న విషయాన్ని జగన్ తేల్చి చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇంతకాలం ప్రకాశం నెల్లూరు జిల్లాల బాధ్యత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూస్తుంటే.. గుంటూరు.. క్రిష్ణా జిల్లాల్ని ఎంపీ మోపిదేవి చూస్తున్నారు.
తాజాగా చేసిన మార్పుల ప్రకారం విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతల్ని విజయసాయికి రెడ్డికి కంటిన్యూ చేయటమే కాదు.. ఢిల్లీ మీద మరింత ఫోకస్ పెట్టాలని అధినేత జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మార్పులు చెందుతాయని.. వాటికి సంబంధించిన అంశాల్ని ఎప్పటికప్పుడు చూడాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.
వైవీ సుబ్బారెడ్డి విషయానికి వస్తే.. గతంలో మాదిరి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చిత్తూరు జిల్లాను కూడా కలిపినట్లుగా చెబుతున్నారు. మిగిలిన ఏడు జిల్లాల్ని వైవీ సుబ్బారెడ్డి చూడాలని డిసైడ్ చేశారు. దీంతో.. పార్టీకి సంబంధించినంత వరకు త్రిమూర్తులు (విజయసాయి.. సజ్జల.. సుబ్బారెడ్డి) ఎవరన్నది తేల్చేయటమే కాదు.. వారికున్న పరిధి ఏ స్థాయిదన్న విషయం తాజా నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి తేల్చేశారని చెప్పాలి. దీంతో.. ఇన్ ఛార్జీల్లో మార్పు అన్న వాదనలకు ఫుల్ స్టాప్ పడినట్లైంది.