Begin typing your search above and press return to search.
చేనేత కార్మికులకు పూర్తి చేయూతనిస్తా:జగన్
By: Tupaki Desk | 30 Jan 2018 7:23 PM ISTఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా 1000 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. అనారోగ్యాన్ని - వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా జగన్...అలుపెరగకుండా కొనసాగిస్తున్న పాదయాత్రకు ప్రజలనుంచి అపూర్వమైన మద్దతు లభిస్తోంది. మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న జగన్....చేనేతలకు భరోసా ఇచ్చారు. తనతో పాటు తన ఫొటోను చేనేత కార్మికులు తమ ఇళ్లల్లో పెట్టుకునేలా వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తానని జగన్ హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశారని ఒక సారి ప్రశ్నించుకోవాలని - బాబు పాలనలో జీవితాలు మెరుగుపడ్డాయా? లేదా? అని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. బాబా పాలనలో రాష్ట్రం పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందన్నారు. 34 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నా....ప్రభుత్వానికి పరామర్శించే తీరిక లేదని జగన్ మండిపడ్డారు. వారిని తాను ఓదార్చానని చెప్పుకోవడానికి గర్వపడతానని జగన్ గద్గద స్వరంతో అన్నారు. చేనేతలకు సబ్సిడీ అందడంలేదని 37 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వారివైపు బాబు కన్నెత్తి చూడలేదని దుయ్యబట్టారు.
తాను వస్తున్నానని తెలిసి మొక్కుబడిగా సబ్సిడీలను చేనేతల ఖాతాల్లో వేశారని - బాబుకు కేవలం ఎన్నికల సమయంలోనే బీసీలపై కపట ప్రేమ పుట్టుకువస్తుందన్నారు. చంద్రబాబు.... చేనేత మగ్గం పక్కన కూర్చొని నేత కార్మికుడిలా ఫీల్ అవుతారని ఎద్దేవా చేశారు. చేనేత కుటుంబానికి వడ్డీ లేని రుణం, ప్రతి జిల్లాకు చేనేత పార్కు - వంటి హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించారు. చేనేతలకు ప్రతి బడ్జెట్ లో రూ. వెయ్యి కోట్లు - లక్షన్నర ఖర్చుతో ప్రతి చేనేత కుటుంబానిక సొంత ఇల్లు - మగ్గాన్ని ప్రభుత్వం ఇప్పిస్తుంన్న హామీలు తుంగలో తొక్కాడన్నారు. దేవుడి దయ - ప్రజల మద్దతుతో రాజన్న పాలన వస్తే ’నవరత్నాలు’ అమలు చేస్తామన్నారు. వాటితో పాటు చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని - ఇంకా చేనేత కార్మికుల సలహాల ప్రకారం వారికి కావాల్సిన వసతులు కల్పిస్తామన్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగిసన తర్వాత బీసీ గర్జన మహాసభ జరిపి - బీసీ డిక్లరేషన్ చేస్తామన్నారు.
ప్రతి ఒక్కరిని పేదరికం నుంచి పారద్రోలే శక్తి చదువుకు మాత్రమే ఉందని, నవరత్నాల్లో కెల్లా గొప్ప పథకం అదేనన్నారు. ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అంటూ....మన పిల్లలు ఇంజనీరింగ్ - డాక్టర్ - తదితర చదువులు చదవగలుగుతున్నారని చెప్పారు. తన ప్రభుత్వంలో ఏ చదువుకైనా అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేలా చేస్తానని హామీ ఇచ్చారు. హాస్టళ్లలో ఉండి చదివే పిల్లలకు ఏడాదికి రూ. 20 వేలు - పిల్లలను బడికి పంపేందుకు సంవత్సరానికి రూ. 15 వేలను ప్రభుత్వం ఇస్తుందన్నారు. అవ్వతాతలకు ఇచ్చే పెన్షన్ ను రూ. 2 వేలకు పెంచుతామని, 45 ఏళ్ల నుంచి ప్రతి పేదవాడికి పెన్షన్ అందేలా చేస్తామని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చాక ఖర్చు రూ. వెయ్యి దాటే ప్రతి వైద్యానికి ఆరోగ్య శ్రీను వర్తింపజేస్తానని - వైద్యానికి ఎన్ని లక్షల ఖర్చైనా భరిస్తానన్నారు. రెస్ట్ పీరియడ్ లో డబ్బులు - దీర్ఘకాలిక రోగులకు 10 వేల పెన్షన్ ను అందజేస్తామని జగన్ చెప్పారు. జగన్ కు నెల్లూరు లో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.