Begin typing your search above and press return to search.

అమరావతిపై అసెంబ్లీ ఫైట్.. జగన్ కీలక వ్యూహం

By:  Tupaki Desk   |   20 Jan 2020 4:50 AM GMT
అమరావతిపై అసెంబ్లీ ఫైట్.. జగన్ కీలక వ్యూహం
X
అమరావతి మార్పు.. 3 రాజధానుల నిర్ణయంపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. సోమవారం ప్రత్యేకంగా సమావేశమవుతున్న ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టడానికి జగన్ సర్కార్ రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ సభలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు - ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారు. కీలక నేతలతో సమావేశమయ్యారు.

3 రాజధానులపై అసెంబ్లీలో టీడీపీ ఆందోళనకు దిగడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై.. బలం లేని మండలిలో టీడీపీని ఎలా ఎదుర్కోవాలనే దానిపై వ్యూహం సిద్ధం చేశారు. రెండు సభల్లో ఎవరు మాట్లాడిన ఒకటే మాటగా ఉండాలని జగన్ స్పష్టం చేసినట్టు తెలిసింది.

ఏపీ అసెంబ్లీలో మూడు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఒకే మాట మాట్లాడాలని..3 రాజధానులను స్వాగతించాలని సీఎం జగన్ దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం. వైసీపీ మంత్రులు - ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఎక్కడా లేకుండా చూసుకోవాలని జగన్ నిర్ధేశించారు.

తొలి రోజు సభలో బిల్లు ప్రవేశ పెట్టాలని.. సభలో టీడీపీ ఆందోళన చేసినా సభ కార్యక్రమాలు అడ్డుకుంటే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఈ భేటిలో సమాలోచన చేశారు. సభలో మూడు రాజధానుల బిల్లును ఆమోదించేలా ప్రభుత్వం.. అడ్డుకుంటామని ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తుండడంతో సభాసమరం ఆసక్తిగా మారింది.