Begin typing your search above and press return to search.

లోటస్ పాండ్ లో జగన్

By:  Tupaki Desk   |   11 Feb 2022 11:00 AM IST
లోటస్ పాండ్ లో జగన్
X
జగన్మోహన్ రెడ్డి చాలా కాలం తర్వాత శుక్రవారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వస్తున్నారు. సీఎం అయిన తర్వాత లోటస్ పాండ్ కు పెద్దగా రాలేదు. తాడేపల్లిలోని ఇంటిని నిర్మించుకుని దాన్నే క్యాంపు కార్యాలయంగా చేసుకున్నారు. మంత్రి బొత్సా సత్యనారాయణ కొడుకు పెళ్ళికి హాజరయ్యేందుకు జగన్ హైదరాబాద్ కు వస్తున్నారు. ఈమధ్యనే బొత్సా కొడుకు నిశ్చితార్ధం జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి జగన్ హాజరుకాలేదు.

అందుకనే ఇపుడు మ్యారేజీకి హాజరు కావాలని డిసైడ్ అయ్యారు. హైదరాబాద్ కు ఎప్పుడు వచ్చినా లోటస్ పాండ్ కు మాత్రం పెద్దగా వెళ్ళటంలేదు. కారణం ఏమిటంటే చెల్లెలు వైఎస్ షర్మిల లోటస్ పాండ్ కేంద్రంగానే తన పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల వల్ల లోటస్ పాండ్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఈ కారణంగానే జగన్ లోటస్ పాండ్ కు రావటం తగ్గించేశారు.

చెల్లెలుతో సరైన సంబంధాలు లేవనే ప్రచారం నేపధ్యంలో ఒకరికి ఒకరు దాదాపు ఎదురు పడకుండానే ఉంటున్నారనే ప్రచారం తెలిసిందే. లోటస్ పాండ్ లో ఇద్దరి ఇళ్ళు ఒకేచోట ఉంటున్న కారణంగా సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగానే జగన్ లోటస్ పాండ్ కు వెళ్ళటంలేదు. షర్మిల రాజకీయ పార్టీ పెట్టకముందు ఒకటి రెండుసార్లు మాత్రమే వచ్చారంతే. పార్టీ పెట్టిన తర్వాత నుండి అసలు లోటస్ పాండ్ లోకి జగన్ అడుగుపెట్టలేదు.

వివాహానికి అటెండ్ అయిన తర్వాత జగన్ మళ్ళీ బేగంపేట విమానాశ్రయంకు చేరుకుని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. 16వ తేదీన తిరుపతికి వెళ్ళబోతున్నారు. బస్టాండ్ దగ్గర నుండి కపిలతీర్ధం వరకు రామసేతు ఫ్లైఓవర్ ను నిర్మించిన విషయం తెలిసిందే.

దాన్ని ప్రారంభించేందుకు తిరుపతికి వెళుతున్నారు. తర్వాత మరికొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆ తర్వాత జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు. కరోనా వైరస్ కారణంగా జిల్లాల పర్యటనకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఉగాధి నుండి కొత్త జిల్లాలు అమల్లోకి రాబోతున్నాయి.