Begin typing your search above and press return to search.

అగ్రెస్సివ్ మోడ్ లో జగన్...?

By:  Tupaki Desk   |   8 April 2022 10:30 AM GMT
అగ్రెస్సివ్ మోడ్ లో జగన్...?
X
జగన్ ఎపుడూ పరుష పదజాలం వాడినది లేదు. ఆయన చాలా తక్కువ మాట్లాడుతారు. మూడేళ్ల అధికారంలో జగన్ తప్ప మిగిలిన మంత్రులే ఎక్కువ సార్లు స్పందించారు. దాంతో వారికే ఫైర్ బ్రాండ్ ట్యాగ్ గట్టిగా పడిపోయింది. అలా చాలా మంది మంత్రులు విపక్షల లిస్ట్ లో ఉన్నారు కూడా. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ వరసగా ఇపుడు విపక్షం మీద మండిపోతున్నారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో చంద్రబాబు, పవన్ ల మీద ఆయన విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

గట్టిగా ఇరవై నాలుగు గంటలు కాలేదు, నంద్యాల జిల్లాలో సైతం అదే రకంగా బిగ్ సౌండ్ చేశారు. ఏపీలోని విపక్షాలకు కడుపు మంట అసూయ అని జగన్ మాట్లాడారు, ఏపీలో దారుణమైన ప్రతిపక్షం ఉందని కూడా జగన్ దుయ్యబెట్టారు. వారికి తోడుగా ఎల్లో మీడియా తయారైంది అని నిప్పులు చెరిగారు.

తాము మంచి పనులు చూస్తున్న కూడా రాయలేని స్థితిలో ఒక సెక్షన్ మీడియా ఉందని కూడా జగన్ ఫైర్ అయ్యారు. ఇక ఏపీలో విపక్షాలు ఎన్ని చేసినా కూడా ప్రజల దీవెనలు తన వైపు ఉన్నంతవరకూ ఏమీ చేయలేరని జగన్ ధీమా వ్యక్తం చేయడం విశేషం.

మొత్తానికి చూస్తూంటే జగన్ అగ్రెస్సివ్ మోడ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. సడెన్ గా ఆయన ఎందుకు విపక్షాల మీద బాణాలు వేస్తున్నారు అన్నదే ప్రశ్నగా ఉంది. ఎన్నికలు ఇంకా రెండేళ్ల వ్యవధిలో ఉండగా జగన్ విపక్షాలను ఎందుకు నిందిస్తున్నారు. అపుడే ఎన్నికల వేడిని ఎందుకు పెంచుతున్నారు అన్నది స్వపక్షానికి కూడా అర్ధం కావడంలేదు.

అయితే జగన్ అంటున్న మాటలు చేస్తున్న విమర్శలు మాత్రం పదునైనవే. ఏపీకి సంబంధం లేకుండా ఎక్కడో హైదరాబాద్ లో విపక్ష నేతలు కూర్చుని తమ మీద విమర్శలు చేస్తున్నారని, బాధ్యతగా వ్యవహరించడం లేదని జగన్ చెప్పడం చూస్తూంటే ఆయన ఫుల్ ఫోకస్ విపక్షం మీద పెట్టేసారు అని అర్ధమవుతోంది.

ఇక ప్రజలు తాను మంచి చేస్తే మళ్లీ ఆశీర్వదిస్తారు, తన మీద ఎవరు ద్వేషం పెంచుకున్నా జనానికే తాను జవాబుదారి అన్నట్లుగా జగన్ చేస్తున్న కామెంట్స్ చర్చ రేపుతున్నాయి. ఈ మొత్తం విషయాన్ని చూసినపుడు గతం కంటే ఏపీలో విపక్షం కాస్తా బలపడిందా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది. లేకపోతే మూడేళ్ళుగా ఒక్క మాట కూడా వారిని అనని జగన్ తానే స్వయంగా హాట్ కామెంట్స్ చేయడం ఉండదనే అంటున్నారు. చూడాలి మరి ఈ మాటల దాడి వెనక ఏ తరహా వ్యూహం ఉందో.