Begin typing your search above and press return to search.

కరోనాకు భయపడే నాయుడు.. జగన్ సెటైర్లు

By:  Tupaki Desk   |   30 Nov 2020 4:30 PM GMT
కరోనాకు భయపడే నాయుడు.. జగన్ సెటైర్లు
X
ఏపీ అసెంబ్లీ అధికార, ప్రతిపక్షాల మధ్య రణరంగంతో తొలిరోజు అట్టుడుకింది. చంద్రబాబు స్పీకర్ పోడియంపై కూర్చొని నిరసన తెలుపడం.. జగన్ కడిగేయడంతో ఉద్రిక్తంగా మారింది.

ఏపీ అసెంబ్లీలో నివర్ తుఫానుపై చర్చ ముగింపు సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. ఇందులో ‘నివర్’ తుఫానుకు సంబంధించిన నష్టంపై ఇంకా అంచనాలు జరుగుతున్నాయని జగన్ తెలిపారు. డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఏ సీజన్ లో జరిగిన నష్టానికి అదే సీజన్ లో పరిహారం చెల్లిస్తామని సీఎం తెలిపారు. డిసెంబర్ 31న పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఆ డబ్బు వారి చేతుల్లోనే పెట్టబోతున్నామని జగన్ తెలిపారు.

తుఫాన్ను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై చర్చ జరుగుతున్న సందర్భంగా చంద్రబాబు వైఖరిని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. కరోనాకు భయపడి ఇన్నాళ్లు దాక్కున్న నువ్వా చెప్పేది అని చంద్రబాబును జగన్ కడిగేశారు. చర్చ జరుగుతున్నప్పుడు ఓ పద్ధతి అనేది ఉండాలని, లేదు.. నాకు ఎటువంటి పద్ధతులు ఉండవు అనుకుంటే... నేను మాట్లాడేది ఇంతే అనుకుంటే వ్యవస్థ అనేది బతకదని జగన్ హెచ్చరించారు..

ఏదైనా విషయం ఉంటే, వారు మాట్లాడడం అయిపోతే మేము మాట్లాడడం మొదలుపెడతాం. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నుంచి ఈ రకమైన ప్రకటన వస్తుందని అంతా ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి వారిని ఇంకా వేచి చూసేలా ఉంచడం సరి కాదు అని జగన్ వివరించారు.