Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు కొత్త పేరు పెట్టిన జగన్

By:  Tupaki Desk   |   24 March 2022 8:00 AM IST
చంద్రబాబుకు కొత్త పేరు పెట్టిన జగన్
X
రాజకీయాల్లో పంచ్ లతో ప్రసంగాలు చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుంటారు. ఆయన వేసే పంచులు బాగా పేలుతాయి. తెలంగాణ యాసలో తిడుతుంటే ఈలలు, గోలలు చేస్తుంటారు. ఏపీలో ఆ లోటు తీర్చే వారు లేరు. ఎందుకంటే చంద్రబాబు ప్రసంగాలు ఊకదమ్ముడుగా ఉంటాయన్న విమర్శలున్నాయి. ఇక జగన్ కు అంత ప్రసంగ సామర్థ్యం లేదంటారు. అయితే ఈ మధ్య జగన్ కూడా తనదైన శైలిలో పంచుల వర్షం కురిపిస్తున్నాడు.

ఏపీ అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం మద్యంపాలసీపై స్వల్పకాలిక చర్చ సాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్ లకు అనుమతి ఇచ్చారని.. ఈ బ్రాండ్ లన్నీ చంద్రన్న కానుకలే అని జగన్ ఆరోపించారు.

ఇప్పుడున్న మద్యం బ్రాండ్ లు అన్నీ చంద్రబాబు ప్రవేశపెట్టినవేనని.. 2019 తర్వాత ఏపీలో ఒక్క మద్యం బ్రాండ్ కు కూడా అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. త్రీ క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్లు లేనే లేవని.. ఆయా బ్రాండ్లు ఉన్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. తాము 16 కొత్త జిల్లాలు, మెడికల్ కాలేజీలకు అనుమతిస్తే చంద్రబాబు 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.

అందుకే చంద్రబాబు ఇంటి పేరు 'నారా' బదులు సారా అంటే కరెక్ట్ గా సూట్ అవుతుందని జగన్ మండిపడ్డారు. జంగారెడ్డి గూడెం మరణాలపై టీడీపీ అబద్దాలు చెబుతోందని సీఎం జగన్ మండిపడ్డారు. టీడీపీ నేతలవి క్రిమినల్ బ్రెయిన్స్ అని.. వారిని జూలో పెట్టాలని జగన్ ఆరోపించారు. మనిషి పరంగా చంద్రబాబు, పార్టీ పరంగా టీడీపీ, మీడియా పరంగా ఎల్లో మీడియా అనేవి ఏపీలో అసలు సిసలు చీప్ బ్రాండ్స్ అని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వీరు లేకున్నా వీరి వక్రీకరణలు ఏపీలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని విమర్శించారు. వీళ్లందరూ మహిళా వ్యతిరేకులన్నారు.

ఇక ప్రస్తుతం ఏపీలో చీప్ లిక్కర్ లేదని.. రాష్ట్ర ప్రభుత్వమే ప్రాసెస్డ్ , డిస్టిల్డ్ లిక్కర్ అమ్ముతోందని జగన్ క్లారిటీ ఇచ్చారు.