Begin typing your search above and press return to search.
జగన్ ఐడియా సూపర్ బాస్..!
By: Tupaki Desk | 2 Nov 2021 8:00 AM ISTఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు, ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ నలమారు చంద్రశేఖర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారు. ఈరోజు ఆయన భాద్యతలు స్వీకరించారు. చంద్రశేఖర్ రెడ్డి 36 సంవత్సరాల పాటు ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేశారు. ఆయన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు జాతీయ ఉపాద్యక్షుడిగా పనిచేశారు. ఉద్యోగుల సంఘం నాయకుడిగా అందించిన సేవలు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది. సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ ఆయన కీలక భూమిక పోషించారు. చంద్రశేఖర్ రెడ్డి జైళ్ల శాఖలో సూపరింటెండెంట్ గా హోదాలో పనిచేస్తూ ఈ ఏడాది జూన్ లో పదవి విరమణ పొందారు. ఆయన కడప జిల్లా వాసి అయినప్పటికీ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన అమరావతికి మకాం మార్చారు.
ఈ సందర్బంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకానికి తగినట్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికుల సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటానని ప్రకటించారు. ఉద్యోగ, ఉపాద్యాయ, పెన్షనర్లు మరియు కార్మికులు ఏ సమస్యలున్నాతన వద్దకు రావొచ్చని ఆయన సూచించారు. సీఎం జగన్ ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. సీఎం జగన్ ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనను ఈ పదవిలో నియమించినందుకు సీఎం జగన్, సజ్జల రామకృష్ణా రెడ్డి, ఉద్యోగ సంఘ నాయకులకు చంద్రశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఏపీ ప్రభుత్వం సతమతమవుతోంది. సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా సీపీఎస్ విధానం రద్దు, పీఆర్సీ, డీఏ పెంచుతామని హామీ ఇచ్చారు. అయతే జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండున్నరేళ్లు అవుతున్నా ఈ హామీల్లో ఎలాంటి పురోగతి లేదు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుకాకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం చర్చనీయాంశమైంది. ఉద్యోగులు నుంచి వస్తున్న ఒత్తిడి నుంచి బయపడేందుకు ప్రభుత్వం చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారనే విమర్శలు వస్తున్నాయి. అందులో ఆయన కడప జిల్లా వాసి కావడంతో ఈ చర్చకు మరింత బాలన్ని చేకూర్చే విధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది.