Begin typing your search above and press return to search.

ఓదార్పు యాత్ర వెనుక అస‌లు క‌థ ఇదేన‌ట‌

By:  Tupaki Desk   |   7 Dec 2017 4:37 AM GMT
ఓదార్పు యాత్ర వెనుక అస‌లు క‌థ ఇదేన‌ట‌
X
అప్ప‌టి ఓదార్పు యాత్ర ఇప్పుడు అవ‌స‌ర‌మా? అనుకుంటే అంత‌కు మించిన త‌ప్పు మ‌రొక‌టి ఉండ‌దు. తెలుగు రాష్ట్ర రాజ‌కీయాలు పెనుమార్పుల‌కు గురి కావ‌టానికి కార‌ణం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ఓదార్పు యాత్రే. ఏం చెప్పినా ఢిల్లీనే చెప్పాలి. వెన్నుముక లేని నాయ‌కుల మాదిరిగా ఢిల్లీ ముందు ప్ర‌ణ‌మిల్లాల‌న్న ఫ‌ర్మాన‌ను స‌వాలు చేసిన వైనం జ‌గ‌న్‌ కు ఎన్నో ఇబ్బందుల్ని తెచ్చి పెట్టింది.

ఇచ్చిన మాట కోసం ఎంత‌కైనా స‌రేన‌న్న ప‌ట్టుద‌ల అక్ర‌మ కేసుల‌కు.. జైలుకు వెళ్లేందుకు కార‌ణ‌మైనా వెన‌క్కి త‌గ్గ‌లేదు. అయినా.. అప్పుడెప్పుడో జ‌రిగిపోయిన విష‌యాల్ని ఇప్పుడు ఎందుకు గుర్తుకు తెస్తున్నార‌న్న సందేహం వ‌చ్చిందా? అక్క‌డికే వ‌స్తున్నాం. తాజాగా పాద‌యాత్ర చేస్తున్న ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన ఆస‌క్తిక‌ర విష‌యాల్లో పాద‌యాత్ర ఎపిసోడ్ ఒక‌టి. అస‌లు జ‌గ‌న్ కు పాద‌యాత్ర చేయాల‌న్న ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింది? ఏ సంద‌ర్భంలో ఆయ‌న పాద‌యాత్ర చేస్తాన‌న్న మాట చెప్పారు?

చెప్పిన మాట కోసం ఆయ‌న ఎన్ని ఇబ్బందులు ప‌డ్డారు? ఢిల్లీ నుంచి వ‌స్తున్న ఒత్తిళ్ల వేళ‌.. జ‌గ‌న్ ఇంట్లో ఏం జ‌రిగింది? త‌ల్లికి.. చెల్లికి.. భార్య‌కు జ‌గ‌న్ ఏం చెప్పారు? అంతా క‌లిసి ఓదార్పుయాత్ర మీద తీసుకున్న క‌లిసి క‌ట్టు నిర్ణ‌యం ఏమిటి? లాంటి ఆస‌క్తిక‌ర విష‌యాల‌కు జ‌గ‌న్ స‌మాధానం ఇచ్చారు. ఆ స‌మాధానం ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

"హెలికాప్టర్‌ ప్రమాదంలో నాయిన చనిపోయిన ప్రదేశానికి వెళ్లినం. 20 రోజులు కూడా కాలా. ఆ ప్రాంతం చూసిన తరువాత కిందికి నడుచుకుంటూ వస్తున్నాం. మాటల్లో నాన్న మరణం తట్టుకోలేక ఇంతమంది చనిపోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారనే చర్చ వచ్చింది. అది మనసులో ఎందుకో తిరుగుతా ఉంది. కిందకు వస్తే సంతాప సభ. దాదాపు కొన్ని వేలమందితో కండోలెన్సు మీటింగ్‌ జరుగుతా ఉంది. అప్పుడు నాటైమ్‌ వచ్చినప్పుడు నేను మాట్టాడేదానికి మైక్‌ తీసుకున్నాను. మాట్లాడేప్పుడు ఎమోషనల్‌ గా చెప్పిన. చనిపోయిన ప్రతి కుటుంబంలోని వాళ్లంతా నా కుటుంబ సభ్యులే. వాళ్ల ఇంటికి వస్తా. వారికి తోడుగా ఉంటా. వారికి భరోసా ఇస్తానని చెప్పిన"

"ఎందుకు చెప్పావంటే నాకు తెలీదు. జస్ట్‌ ఎమోషనల్‌ గా చెప్పిన.నాయిన చనిపోయిన ప్రదేశంలో చెప్పినం కాబట్టి మాట నిలబెట్టుకోవాలని నా ఆరాటం. అది వీళ్లకు అర్థం కాదు. అది చినికిచినికి గాలివాన అయి అది లాస్ట్‌ కు ఏ స్టేజికి వచ్చిందంటే నువ్వు పోతే నిన్ను ఇబ్బందులు పెడతాం. నువ్వు ఉండాలంటే మాట తప్పాల. నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాము. ఇంకోటిస్తాం. తరువాత ముఖ్యమంత్రిని చేస్తాం. ఇలా రకరకాలుగా ప్రలోభాలెన్నో"

"బట్‌ ఎండ్‌ ఆఫ్‌ ద డే. అవన్నీ ఏమొచ్చినాయో దేవుడెరుగు. తీసుకున్నా నాకు వేల్యూ ఉండదు. ఇక్కడ విశ్వసనీయత పోయిన తరువాత - ఆయన చనిపోయిన ప్రదేశంలో మాట చెప్పిన తరువాత.. చివరకు నేను - అమ్మ - పాప ముగ్గురమూ వచ్చాం. ముగ్గురమూ మాట్లాడాం. నేను అమ్మకు ఒక్కటే చెప్పాను. అమ్మా రెండు దారులున్నాయి. ఒకదారి అయితే మాట తప్పమంటున్నారు.. పదవులు ఇస్తామంటున్నారు. రెండో దారి అయితే మాట మీదే నిలబడతాం.. పదవులు రావు బహుశా ఇబ్బందులూ పెడతారు. బట్‌ మాట మీదయితే నిలబడతాం. మాట మీద నిలబడతారన్న పేరయితే నాన్నకు ఉంది. అల్టిమేట్‌ గా ఏదో ఒకరోజు అందరమూ చనిపోతాం. చనిపోయిన తరువాత మన గురించి ప్రజలేమనుకుంటారనేది వాట్‌ విల్‌ లీవ్‌ బ్యాక్‌. ఆ మాట నేనన్నప్పుడు షర్మిల - అమ్మ - భారతి నన్ను సపోర్టుచేశారు. నీ ఆలోచనే కరెక్టు. మాట చెప్పిన తరువాత దానిపై నిలబడాల్సిందే. చేయాల్సిందే. తప్పేమీ కాదు. నిజాయితీగా ఉన్నాం. సోనియాగాంధీ గారికి రాజీనామా లేఖ రాసేసి పార్టీనుంచి బయటకు వచ్చేసినం" అని అస‌లు విష‌యాన్ని చెప్పారు జ‌గ‌న్‌.