Begin typing your search above and press return to search.
విశాఖకు జగన్... సంచలనమేనా... ?
By: Tupaki Desk | 16 Dec 2021 2:33 PM ISTజగన్ తాడేపల్లి నుంచి బయటకు రావడమే గగనమని విపక్షాలు విమర్శలు తరచూ చేస్తాయి. జగన్ సైతం గత రెండున్నరేళ్ల కాలంలో పెద్దగా ఎక్కడికీ వచ్చింది కూడా లేదు. ఇక విశాఖ తనకు ఇష్టమైన ప్రాంతమని జగన్ ఎన్నో సార్లు చెప్పుకున్నారు.
విశాఖను పరిపాలనా రాజధానిగా చేశారు. అందుకోసం మూడు రాజధానుల చట్టాన్ని కూడా జగన్ రూపొందించి చట్ట సభల్లో ఆమోదముద్ర వేయించుకున్నారు. అయితే అది న్యాయ స్థానంలో విచారణ దశలో ఉండగానే హఠాత్తుగా ఈ మధ్యనే శాసనసభ సమావేశాల వేళ రద్దు చేసుకున్నారు.
ఇపుడు ఒకే రాజధాని ఏపీకి టెక్నికల్ గా ఉంది. అదే అమరావతి. విశాఖకు రాజధాని కావాలని కోరిక అక్కడ జనాలకు ఉంది. ఈ నేపధ్యంలో వచ్చిన రాజాధాని వెళ్ళిపోయింది అన్న బాధ ఉంది.
మూడు రాజధానుల రద్దు తరువాత జగన్ తొలిసారిగా విశాఖ టూర్ పెట్టుకున్నారు. విశాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా విశాఖ రాజధాని గురించి జగన్ మనసులో మాట ఏమైనా చెబుతారా అన్న ఆసక్తి అందరిలో ఉంది.
విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు అయితే ఈ మధ్య మళ్లీ రాజధాని మీద భారీ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. గుడివాడ అమరానాధ్ లాంటి యువ ఎమ్మెల్యేలు అయితే రాజధాని విశాఖకు రాకుండా పోదు అని బల్ల గుద్దుతున్నారు.
అదే విధంగా ఎంపీలు ఇతర సీనియర్ నాయకులు కూడా చెబుతున్నారు. అయితే మూడు రాజధానుల చట్టం రద్దు చేసిన మీదట రాష్ట్ర స్థాయిలో అయితే దాని మీద పెద్దగా ప్రకటనలు కీలక నేతలు ఇవ్వడంలేదు.
దాంతో ఆ సందేహం, సందిగ్దం అలాగే ఉండిపోయింది. మరి చాలా కాలానికి విశాఖ వస్తున్న జగన్ రాజధాని విషయంలో సంచలన ప్రకటన చేస్తారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే విధంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. అదే టైమ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది. ప్రైవేటీకరణ మీద వైసీపీ చేయాల్సింది చేసింది అని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
కానీ కేంద్రం మీద వత్తిడి తేవడానికి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లమని డిమాండ్ అయితే ఉంది. కానీ ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన అయితే లేదు, జగన్ విశాఖ టూర్ లో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కూడా ముఖ్యమంత్రిని కలుస్తాయని అంటున్నారు. ఇక విశాఖకు జగన్ రావడం వెనక మరో రెండు విషయాలు ఉన్నాయి.
అందులో ఒకటి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మనవరాలు వివాహా రిసెప్షన్ కూడా ఉంది. అలాగే పార్టీకి చెందిన డీసీసీబీ చైర్మన్ కుమార్తె వివాహానికి కూడా జగన్ హాజరవుతారని అంటున్నారు. మొత్తం మీద విశాఖ టూర్ లో జగన్ ఏం చెప్పబోతున్నారు అన్నదే ఈసారి ఇంటరెస్టింగ్ మ్యాటర్. ఈ నెల 17న జగన్ విశాఖ రానున్నారని అధికార వర్గాల సమాచారం.