Begin typing your search above and press return to search.
జగన్ ఎత్తులకు..బాబు చిత్తు చిత్తు అయినట్టే!
By: Tupaki Desk | 31 Dec 2019 9:43 AM IST40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. నాలుగు పదుల వయసు కలిగిన వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన ఎత్తులకు నిజంగానే చిత్తు చిత్తు అయిపోయారని చెప్పక తప్పదు. ఎన్నికల ముందు నాటి నుంచి కూడా చాలా వ్యూహాత్మకంగా కదులుతున్న జగన్... ఎన్నికల్లో బాబు అండ్ కో ను చిత్తుచిత్తు చేసి పారేశారు. ఆ తర్వాత అసలు టీడీపీ అన్నదే కనిపించకుండా చేసే దిశగా కదులుతున్న జగన్... బాబు కంటిని బాబు చేతితోనే పొడిపించే వ్యూహాలకు పదును పెట్టారు. అయితే జగన్ వేసే ఎత్తులను అంత లోతుగా పరిశీలించకుండానే ఎదురు దాడికి దిగుతున్న చంద్రబాబు... అడ్డంగా బొక్క బోర్లా పడిపోయారు - ఇంకా పడిపోతారని కూడా ఖాయంగానే చెప్పొచ్చు.
సరే.. జగన్ వేసిన ఎత్తులు ఏమిటి? వాటి లోగుట్టును తెలుసుకోకుండా వెర్రి వెంగళప్పలా దిగిపోయి తనను తాను చంద్రబాబు ఎలా ముంచేసుకుంటున్నారన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి. ఎన్నికల్లో కులాల సమీకరణలాతో బాబు బరిలోకి దిగితే... అందుకు విరుగుడు మంత్రాన్ని పఠించిన జగన్... టీడీపీకి మంచి పట్టున్న బీసీలను తన వైపునకు తిప్పేసుకున్నారు. ఈ క్రమంలో కాపులకు రిజర్వేషన్లపై తనదైన శైలి కామెంట్లు జగన్ చేస్తే... జగన్ కు కాపులు దూరయ్యారని సంబరపడ్డ చంద్రబాబు... తన వెన్నంటి సాగిన బీసీలు జగన్ పంచన చేరిన వైనాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. ఫలితంగా 175 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే... 23 సీట్లలోనే టీడీపీ గెలిచింది. ఇక 13 జిల్లాల రాష్ట్రంలో ఏకంగా నాలుగు జిల్లాల్లో చంద్రబాబును జగన్ జీరోను చేసి పారేశారు.
ఈ షాక్ నుంచి కోలుకునేందుకు చంద్రబాబుకు ఎంతమాత్రం సమయం ఇవ్వకుండా పావులు కదిపిన జగన్... రాజధాని అనే తేనెతుట్టెను కదిపేశారు. ఏపీకి మూడు రాజధానులుంటాయేమోనంటే జగన్ చేసిన ప్రకటన నిజంగానే చంద్రబాబు శిబిరంలో పెను కలరవాన్నే రేపిందని చెప్పాలి. అయినా అమరావతిలో ఎలాగూ లెజిస్లేచర్ కేపిటల్ ను కొనసాగిస్తున్నాం కదా... ఇక ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖకు - జ్యూడిషియల్ కేపిటల్ ను కర్నూలుకు తరలిస్తే సమస్యేమిటన్న అంశాన్ని జగన్ బాగానే ఎలివేట్ అయ్యేలా చేశారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దని చెప్పడమంటే... ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము వ్యతిరేకమని ఒప్పుకోక తప్పదు. కర్నూలుకు హైకోర్టు వద్దంటే... రాయలసీమ అభివృద్ధికి వ్యతిరేకమని ఒప్పుకోక తప్పదు. ఈ తరహాలో జగన్ విసిరిన ప్లాన్ ను చంద్రబాబు జీర్ణించుకోవడానికి చాలా సమయమే పట్టింది.
అయితే తనను నమ్మి అమరావతి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల సాగు భూములు ఇచ్చిన రైతుల పక్షాన పోరాటం సాగించక తప్పని పరిస్థితి చంద్రబాబుది. ఆ దిశగానే బాబు సాగారు. ఈ లోగా... తమ ప్రాంతాలు అభివృద్ధి చెందడం బాబుకు ఇష్టం లేదని ఇటు ఉత్తరాంధ్రతో పాటు అటు రాయలసీమ జనం ఓ భావనకు వచ్చేశారు. వెరసి ఆ రెండు ప్రాంతాల్లో ఇప్పుడు టీడీపీ మరింతగా వీకైపోయిందనే చెప్పాలి. ఇక అమరావతిలో రాజధానిని కొనసాగించాలని సాగుతున్న ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన చంద్రబాబుకు భవిష్యత్తులో ఇక్కడ మాత్రమే ఓట్లు పడతాయి. సీట్లూ దక్కుతాయి. ఈ తరహా పరిణామాన్ని కూడా జగన్ చాలా తెలివిగా తనకు అనుకూలంగా మలచుకోవడం ఖాయమే. ఎందుకంటే... చంద్రబాబు తన సొంత సామాజిక వర్గం కమ్మలకే ప్రాధాన్యం ఇస్తారని ఇప్పటికే జగన్ఆరోపిస్తున్నారు కదా. అంటే రేపు ఇక్కడ చంద్రబాబుకు దక్కే సీట్లు బాబుపై కమ్మ ముద్రను మరింతగా పెంచుతాయి. వెరసి కృష్ణా - గుంటూరు జిల్లాలకు మాత్రమే బాబు పరిమితమైపోతారన్న మాట. అంటే జగన్ నిర్ణయంపై పోరాటం చేసిన బాబు బూమరాంగ్ అయినట్టే కదా.