Begin typing your search above and press return to search.

జగన్... చంద్రబాబు తరువాత ఆ పేరే చెబుతున్నారు...?

By:  Tupaki Desk   |   29 March 2022 11:30 PM GMT
జగన్... చంద్రబాబు తరువాత ఆ పేరే చెబుతున్నారు...?
X
ఏపీ రాజకీయాల్లో వైసీపీ టీడీపీగా జనాలు ఫిక్స్ అయిపోయారు. టీడీపీని ఓడిస్తే వైసీపీని తెచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. ఇక వైసీపీ ఓడితే మళ్ళీ టీడీపీనే గెలిపిస్తారు, అలా గెలిపించాలన్నది పొలిటికల్ మేధమేటిక్స్ చెబుతున్న సూత్రం. కానీ రాజకీయాల్లో సూత్రాలకు విలువ ఉంది. కానీ అవి కూడా ఒక్కోసారి గాలికి కొట్టుకుపోతాయి.

దానికి నిలువెత్తు సాక్ష్యం పంజాబ్ ఎన్నికలు. పంజాబ్ లో ప్రధాన పార్టీలు ఆ రాష్ట్రాన్ని ఏళ్ళకు ఏళ్ళ పాటు పాలించిన పార్టీలను సైతం పక్కన పెట్టి మరీ ఆప్ ని జనాలు నెత్తికెత్తుకున్నారు. మరి అలాంటి చైతన్యమే ఏపీలో వస్తే ఏం జరుగుతుంది. కొత్త మోజు పుడితే ఏ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. జగన్, బాబులను చూసేశాము, ఇపుడు పవన్ని కూడా ఒకసారి చూద్దామనుకుని జనాలు గట్టిగా డిసైడ్ అయితే ఏం అవుతుంది. అది పెను సంచలనమే అవుతుంది.

ఏపీలో ఇపుడు అలాంటి చర్చ సాగుతోంది అంటున్నారు. ఏపీలో వైసీపీ గ్రాఫ్ తగ్గుతోంది అంటున్నారు. అది నిజమే కావచ్చు కూడా. అధికారంలో ఉన్న పార్టీ మీద సానుకూలత తగ్గి వ్యతిరేకత పెరగడం సహజం. దాన్ని యాంటీ ఇంకెంబెన్సీ అంటారు. మరి ఆపోజిట్ గా ఉన్న టీడీపీ కి ఆ వ్యతిరేకత ఏమైనా కలసి వస్తుందా అంటే టీడీపీ గ్రాఫ్ అయితే పెద్దగా పెరగడం లేదు అంటున్నారు.

మరి ఏం జరుగుతోంది, జనాల్లో వచ్చే వ్యతిరేకత ఎటు పోతుంది, ఏ వైపునకు మళ్ళుతుంది అంటే చిత్రమైన సిట్యువేషనే పొలిటికల్ గా ఏపీలో ఆవిష్కృతం అవుతోంది అని చెప్పాలి. ఏపీలో మూడవ పార్టీగా ఉన్న జనసేన గ్రాఫ్ మెల్లగా పెరుగుతోంది. అవును ఇది నిజమని చెప్పే సర్వేలు కొన్ని ఉన్నాయి. అవి ప్రైవేట్ సర్వేలు. ఎవరికి వారు రాజకీయ ఆసక్తితో చేస్తున్న సర్వేలు.

ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు వస్తే మీరు ఎంచుకునే ముఖ్యమంత్రి ఎవరు అని జనాలకు ప్రశ్నను సంధిస్తే వారిచ్చే జవాబు ఏంటో తెలుసా. జగన్, బాబులను చూసేశాం కాబట్టి పవన్ని ఈసారి ఎన్నుకుంటామని, నిజంగా ఇది జనసైనికులకు ఆనందించే వార్తగానే చూడాలి.

ఏపీలో జనసేన ఆరు శాతం ఓట్ల దగ్గరే ఉంది అనుకునే వారికి కూడా షాకిచ్చే న్యూస్ గా భావించాలి. ఏపీలో జనసేన గ్రాఫ్ అంతకంతకు పెరిగి ఓట్ల షేర్ కూడా బాగా పెంచుకుంటోంది. జనసేన అవిర్భావ సభ తరువాత పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ పార్టీకి అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఒక విధంగా పవన్ ఇచ్చిన స్పీచ్ జనాలను ఆలోచింపచేసింది అంటున్నారు. ఏపీ బాధ్యతలను తాను తీసుకుంటాను అని పవన్ ఇచ్చిహ భరోసా కూడా ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు.

ఇక పవన్ కి ఏపీలో యువత, మహిళల నుంచి మద్దతు దక్కుతోందని ఆయా సర్వేలు చెబుతున్నాయి. మరి ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలీ అంటే ఆ రెండు వర్గాల మద్దతు అవసరం. ఆ విధంగా చూసుకుంటే జనసేనకు మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు. మరి దీన్ని ఓట్ల రూపంగా మార్చుకునేందుకు ఆ పార్టీ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. సరైన ఎన్నికల వ్యూహాలను కూడా అమలు చేయాల్సి ఉంది.