Begin typing your search above and press return to search.

జగన్..చంద్రబాబు.. పవన్.. ముగ్గురినీ కలిపేశారు...?

By:  Tupaki Desk   |   3 Feb 2022 8:00 AM GMT
జగన్..చంద్రబాబు.. పవన్.. ముగ్గురినీ కలిపేశారు...?
X
ఏపీ రాజకీయాల్లో ఆ ముగ్గురివీ వేరు వేరు దారులు. మరీ ముఖ్యంగా చెప్పాలీ అంటే జగన్ ది కంప్లీట్ సెపరేట్ ట్రాక్. ఈ ముగ్గురి రాజకీయ పంధా వేరు అయినా వారికి ఒకే చోటకు చేర్చి కలపాలని అనుకుంటున్నారు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్. ఇంతకీ విషయం ఏంటి అంటే దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని ఆయన కోరుకుంటున్నారు. ఇందుకోసం ఒక వేదిక ఉండాలని కూడా ఆయన ఆశిస్తున్నారు.

ఇక స్టాలిన్ లో ఈ కొత్త ఆలోచనలు రావడంతోనే ఏకంగా జాతీయ ప్రాంతీయ పార్టీల అధినేతలను లేఖలు రాసారు. అంతా కల్సితేనే దేశంలో సమానత్వం, ఆత్మగౌరవం, సమాజిక న్యాయం వంటి వాటిని సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో అంతా ఒక్క త్రాటిపైకి వచ్చి పోరాడాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే దేశంలో 37 మంది రాజకీయ నాయకులకు స్టాలిన్ లేఖ రాసి సంచలనం రేకెత్తించారు.

ఆ జాబితాలో సోనియా గాంధీ నుంచి ఆమె రాజకీయ బద్ధ విరోధి జగన్ని కూడా చేర్చారు. ఇక ఏపీలో చూసుకుంటే జగన్ కి చంద్రబాబుకు అసలు పడదు, అలాంటి ఇద్దరినీ కూడా ఈ వేదికలో చేరాలని స్టాలిన్ కోరడమే విశేషం. అదే విధంగా పవన్ కళ్యాణ్ ని కూడా చేతులు కలపాల‌ని ఆహ్వానించడం ఇంకా విశేషం. పవన్ తన జనసేనను బీజేపీతో జట్టు కలిపి ఉంచారు. ఆ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్నారు.

ఇక కేసీయార్ ని ఈ కూటమిలోకి ఆహ్వానించడం పెద్ద వింత కాదు, ఆయన ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా గొంతు విప్పారు. కానీ ఏపీలో చూసుకుంటే మాత్రం బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చే పార్టీలుగానే టీడీపీ వైసీపీ ఉన్నాయి. మరి అలాంటి పార్టీలను బీజేపీకి యాంటీగా పోరాడుదాం రండి అని స్టాలిన్ పిలవడంలో ఆంతర్యం అయితే తెలియడంలేదు.

అయితే ఇక్కడ ఒక విషయం ఉంది స్టాలిన్ కాంగ్రెస్ పక్షంలో ఉన్నారు. రేపటి రోజున కేంద్రంలో యూపీయే సర్కార్ అధికారంలోకి రావాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. మరి దానికి దేశంలోని ప్రాతీయ పార్టీలన్నీ కూడా మద్దతు ఇవ్వాలి. ఆ విధంగా ఆయన సోనియా గాంధీ తరఫున ఈ పని చేస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి సోనియా గాంధీ అన్నా కాంగ్రెస్ అన్నా జగన్ కి పడదు, కేసీయార్ కూడా కాంగ్రెస్ లేని కూటమి అంటున్నారు.

ఇలా వీరందరూ దేశ రాజకీయాల మీద వివిధ రకాల అభిప్రాయలతో ఉన్నారు. మరి ఒకే చోట అందరినీ చేర్చ‌డం ద్వారా స్టాలిన్ జాతీయ స్థాయిలో రాజకీయ ఆల్టర్నేషన్ మోడీకి తీసుకురావాలని అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకూ సాధ్యపడుతుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇంతకీ స్టాలిన్ రాసిన లేఖ మీద ఈ నాయకులు రెస్పాండ్ అవుతారా. చూడాలి.