Begin typing your search above and press return to search.

జగన్ ఊపిరి పీల్చుకోవచ్చు.. గొప్ప ఊరట

By:  Tupaki Desk   |   9 Sept 2022 11:16 AM IST
జగన్ ఊపిరి పీల్చుకోవచ్చు.. గొప్ప ఊరట
X
అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్ ఇదొక గొప్ప ఊరటగానే చెప్పొచ్చు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎవరిని భయపెట్టాలన్నా.. అదుపు చేయాలని సీబీఐ, ఈడీ లను ఉసిగొల్పుతోందన్న విమర్శ దేశవ్యాప్తంగా ఉంది. అందరినీ కంట్రోల్ లో పెట్టడానికి వీటినే ఆయుధంగా వాడుతోందన్న ప్రచారం ఉంది. అయితే అన్ని వేళలా వాటి దూకుడు కొనసాగకపోవచ్చు. తాజాగా ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అతడికి గొప్ప ఊరట లభించింది. ఈడీ ముందరి కాళ్లకు బంధం పడినట్టైంది.

తెలంగాణ హైకోర్టు తీర్పు ఏపీ సీఎం జగన్ కు ఎంతో ఊరటనిచ్చిందనే చెప్పాలి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో మొదట సీబీఐ చార్జీషిట్లు తేలాల్సి ఉంది. ఆ కేసులు వీడిపోతేనే ఈడీ కేసులు కూడా ఉండవని హైకోర్టు తీర్పునివ్వడం సంచలనమైంది.

సీబీఐ కేసులు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సీఎం జగన్ సాన్నిహిత్యంగా ఉంటున్నారు. ప్రతీ బిల్లులు, ఇతర వ్యవహారాల్లో కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు. సో కేంద్రం చేతుల్లోని సీబీఐ జగన్ కేసులను తేల్చేలా కనిపించడం లేదు.

ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సీబీఐ కేసులు తేలేవరకూ ఈడీ కేసులపై తీర్పు వెల్లడించారని ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ కేసులు అటకెక్కినట్టేనన్న చర్చ సాగుతోంది. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విచారణ చేపట్టవద్దని గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది.

హైకోర్టు తీర్పు కేవలం జగన్ కుమాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా సీబీఐతో పనిలేకుండా దూకుడు చూపిస్తున్న ఈడీకి షాక్ తగిలినట్టుగా చెప్పొచ్చు. ఈడీ నేరుగా కేసులు దాఖలు చేయలేదు. సీబీఐ లేదా ఐటీ అధికారులు నమోదు చేసే కేసుల వివరాలు తీసుకొని అందులో మనీలాండరింగ్ ఉంటేనే కేసులు పెడుతుంది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ అదే చేసింది.

దీంతో సీబీఐ విచారణ పూర్తయిన తర్వాతనే ఈడీ కేసులు విచారణ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీబీఐ తేల్చకపోతే ఈడీ కేసులు తేలవన్నమాట.. ఇది జగన్ కు , ఇతర కేసుల్లో ఉన్న వారికి గొప్ప ఊరటగానే చెప్పొచ్చు. ఈ లూప్ హోల్స్ కొందరికి వరంగా మారడం ఖాయం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.