Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై జగన్ పంచుల వర్షం

By:  Tupaki Desk   |   30 Nov 2020 3:30 PM GMT
చంద్రబాబుపై జగన్ పంచుల వర్షం
X
తొలిరోజే ఏపీ అసెంబ్లీ రణరంగమైంది. ఏపీ అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుకున్నాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై అసెంబ్లీ వేదికగా జగన్ పంచులు వర్షం కురిపించారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా సభలో చంద్రబాబు చేసిన రచ్చ అంతా ఇంతకాదు. ఎప్పట్లానే కళ్లు పెద్దవి చేసి వేలు చూపించి చంద్రబాబు బెదిరించారు. ఏం పీకుతావ్ అంటూ బూతులు మాట్లాడిన వైనం వెలుచూసింది.

దీంతో సీఎం జగన్ తనదైలి శైలిలో చంద్రబాబును కడిగిపారేశారు. ‘చంద్రబాబు పై కంపార్ట్ మెంట్ లో సెన్స్(బ్రెయిన్ లేదు అని అర్థం వచ్చేలా..) లేదన్నారు.

రైతుల గురించి తనను మాట్లాడనివ్వండని పోడియం మీదకు ఎక్కిన చంద్రబాబును జగన్ పంచులతో ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు బుర్రలేదని.. ఓ వైపు లెక్కలు తీస్తున్నాం. నెలతిరగకముందే రైతుల చేతుల్లో డబ్బులు పెట్టబోతున్నాం.. ఇంత చెబుతున్నా ఆయనకు అర్థం కావడం లేదు. పైకంపార్ట్ మెంట్ లో ఖాళీ స్థలం తప్ప ఏమీ లేదని పంచులు వేశారు.

ఇప్పుడు చంద్రబాబుపై జగన్ వాడిన ‘పై కంపార్ట్ మెంట్ ఖాళీ’’ పదం వైరల్ అయిపోయింది. చంద్రబాబుపై సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఎమోజీలు, ట్రోల్స్ తో తెగ హడావుడి చేస్తున్నారు.

మొదటి రోజు అసెంబ్లీలోనే జగన్ ఇలా పంచ్ ల వర్షం కురిపించడం.. చంద్రబాబు పోడియం ఎక్కడంతో ఏపీ అసెంబ్లీ వీక్షకులకు ఫుల్ మాజాను పంచింది. రాబోయే రోజుల్లో ఇది మరింత రక్తికట్టడం ఖాయంగా కనిపిస్తోంది.