Begin typing your search above and press return to search.

120 ఏళ్ల రికార్డును బద్ద‌లు కొట్టిన జ‌గ‌న్!

By:  Tupaki Desk   |   19 Feb 2020 11:00 AM GMT
120 ఏళ్ల రికార్డును బద్ద‌లు కొట్టిన జ‌గ‌న్!
X
ఏపీ సీఎం జ‌గ‌న్ పేరు ఇరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోన్న సంగ‌తి తెలిసిందే. పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తూ వస్తున్న జ‌గ‌న్ ఇవ్వ‌ని హామీల‌పై కూడా ఫోక‌స్ పెట్టారు. ఏపీలో మునుపెన్న‌డూ లేని సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డ‌మే కాకుండా...ప‌క‌డ్బందీగా అమ‌లుచేస్తున్న యంగ్ అండ్ డైన‌మిక్ సీఎం జ‌గ‌న్‌పై ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇప్ప‌టికే జ‌గ‌న్‌ను ప‌లువురు సీఎంలు రోల్ మోడ‌ల్‌గా తీసుకోగా....ప‌లు రాష్ట్రాలు ఏపీ ప‌థ‌కాల‌ను కాపీ కొడుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా జ‌గ‌న్ మ‌రో చ‌రిత్ర సృష్టించేందుకు సిద్ధ‌మ‌య్యారు. 120 ఏళ్ల‌లో ఏ ప్ర‌భుత్వం చేప‌ట్టని బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టి రికార్డు క్రియేట్ చేశారు.

సీఎంగా ప‌ద‌వి చేప‌ట్టిన అత త‌క్కువ కాలంలోనే జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీస‌కున్నారు. అవినీతిర‌హిత పాల‌న అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు పోతున్నారు. ఈ క్ర‌మంలో ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా లెక్క‌చేయ‌కుండా అవినీతిని అంత‌మొందించేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా స‌మ‌గ్ర భూ స‌ర్వే చేప‌ట్టేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. అక్ర‌మ రిజిస్ట్రేష‌న్లకు చెక్ పెడుతూ ఎవ‌రి భూములు వారికి ద‌క్కాల‌న్న ఉద్దేశ్యంతో ఈ స‌ర్వే పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ స‌ర్వే విజ‌య‌వంత‌మైతే అవినీతిప‌రులు, అక్ర‌మార్కుల‌కు చెక్ ప‌డుతుంది. తద్వారా అస‌లైన హ‌క్కుదారుల‌కు భూమి ద‌క్కుతుంది.

భూవివాద ర‌హిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాల‌ని జ‌గ‌న్ సంక‌ల్పించారు. అందుకే 120 ఏళ్లుగా ఏ సీఎం చేయ‌ని ప‌నిని జ‌గ‌న్ చేస్తున్నారు. బ్రిటిషు వారి పాల‌న‌లో జ‌రిగిన స‌మ‌గ్ర భూస‌ర్వే త‌ర్వాత తాజాగా జ‌గ‌న్ పాల‌న‌లో మ‌ర‌సారి భూ స‌ర్వే జ‌ర‌గ‌డం విశేషం. వాస్త‌వానికి 30 ఏళ్ల‌కోసారి స‌మ‌గ్ర భూ స‌ర్వే జ‌ర‌గాలి. అయితే, త‌మ స్వ‌లాభం కోసం గ‌త ప్ర‌భుత్వాలు ఈ స‌ర‌వే చేయ‌లేదు. త‌మ అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని, త‌మ నేత‌ల క‌బ్జాలీల‌లు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని భూదందాపై గ‌త పాలకులు నోరు మెద‌ప‌లేదు. గ్రామాల్లో క‌ర‌ణాల వ్య‌వ‌స్థ ఉన్నంత కాలం....భూరికార్డులు పార‌ద‌ర్శ‌కంగా ఉన్నాయి. ఎన్టీఆర్ హ‌యాంలో ఆ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌డంతో ఈ రికార్డుల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి.

పాద‌యాత్ర స‌మ‌యంలో స‌మ‌గ్ర భూ స‌ర్వే పై జ‌గ‌న్ హామీ ఇచ్చారు. 60 శాతం సివిల్ కేసుల‌కు భూవివాదాలే ముఖ్య కార‌ణం. తాజా స‌ర్వేతో 90 శాతం భూ వివాదాలు, స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి. ఈ స‌ర్వే వ‌ల్ల‌. భూవివాదాల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉంది. అవినీతి ర‌హిత స‌మాజం కోసం త‌ప‌న‌ప‌డుతున్న జ‌గ‌న్...భూ ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం బిగించి మ‌రో న‌యా రికార్డు క్రియేట్ చేశారు. స‌ర్వే విజ‌య‌వంత‌మైతే..గ‌త‌ ప్ర‌భుత్వాలు ఎంత భూమిని స్వాహా చేశాయి....ఏఏ నేత‌ల అవినీతి శాత‌మెంత అన్న‌ది బ‌య‌ట‌కొస్తుంది. క‌లుగులో దాక్కున్న భూ బ‌కాసుర ఎలుకల‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మ‌వ‌డంతో అవినీతి నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.