Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పిలుపు!..హోదా కోసం అంతా హోరెత్తాల్సిందే!

By:  Tupaki Desk   |   2 April 2018 1:46 PM IST
జ‌గ‌న్ పిలుపు!..హోదా కోసం అంతా హోరెత్తాల్సిందే!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌స్తుతం అన్ని రాజ‌కీయ పార్టీలు కొన‌సాగిస్తున్న పోరు ప‌తాక స్థాయికి చేరుకుంద‌నే చెప్పాలి. ఇత‌ర పార్టీల మాట ఎలా ఉన్నా... ఏపీలో విప‌క్ష పార్టీ వైసీపీ మాత్రం ఆది నుంచి త‌న ఒకే బాట‌లో సాగుతోంద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఏపీకి ప్ర‌త్యే హోదా వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌న్న విష‌యంపై రాష్ట్ర ప్ర‌జ‌లు... ప్ర‌త్యేకించి యువ‌త‌, విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏకంగా యువ భేరీల పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాల‌కు యువ‌త పోటెత్తింద‌నే చెప్పాలి. ప్రత్యేక హోదా కోసం దీక్ష‌కు దిగిన జ‌గ‌న్‌ను చంద్ర‌బాబు స‌ర్కారు బ‌ల‌వంతంగా విర‌మించేలా చేసింది. అయినా కూడా వివిధ మార్గాల్లో ప్ర‌త్యేక హోదా కోసం త‌న‌దైన శైలి ఉద్య‌మం కొన‌సాగిస్తున్న జ‌గ‌న్‌.. ప్ర‌స్తుత పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల్లో పోరును మ‌రింత ఉధృతం చేశారు. ఈ పార్ల‌మెంటు సమావేశాల చివ‌రి రోజు దాకా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని, లేనిప‌క్షంలో త‌మ పార్టీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తార‌ని కూడా జ‌గ‌న్ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు.

అంతేకాకుండా మొన్న‌టికి మొన్న ప‌రిస్ధితిపై మ‌రోమారు ఎంపీల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన జ‌గ‌న్‌... పార్ల‌మెంటులో త‌మ రాజీనామాలు స‌మ‌ర్పించే ఎంపీలు నేరుగా ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ చేరుకుని నిర‌వ‌ధిక‌ నిరాహార దీక్ష‌కు దిగుతార‌ని కూడా ప్ర‌క‌టించేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో హోదా పోరును జ‌గ‌న్ మ‌రింత‌గా పెంచేశార‌నే చెప్పాలి. ఇలాంటి కీల‌క త‌రుణంలో కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఏపీ ప్ర‌జ‌లు - ప్ర‌త్యేకించి యువ‌త‌కు సందేశ‌మిస్తూ జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. యువత ఉద్యోగాలకు ప్రత్యేక హోదా అనేది పర్యాయపదమని జ‌గ‌న్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనివర్శిటీ ప్రాంగణాలలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం - మండలం - జిల్లా స్థాయుల్లో విద్యార్థులు - వైసీపీ నేతలు కలసి రిలే నిరాహారదీక్షలు చేపట్టాలని స‌ద‌రు ట్వీట్ లో పిలుపునిచ్చారు.

మొత్తంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటానికి అంతటా మ‌ద్ద‌తు హోరెత్తాల‌ని, కేంద్రం మెడ‌లు వంచేలా ఉద్య‌మించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అంతేకాకుండా అధికార టీడీపీకి కూడా ఆయ‌న ట్విట్ట‌ర్ వేదికగా ఓ విజ్ఞ‌ప్తి చేశారు. ప్రత్యేక హోదా అనేది మన హక్కు అని... పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా పడిన వెంటనే వైసీపీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తారని... ఆ తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ లో నిరవధిక నిరాహారదీక్షను చేపడతారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, యువత భవిష్యత్తు కోసం టీడీపీ ఎంపీల చేత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయించాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని జ‌గ‌న్ త‌న ట్వీట్ లో విస్ప‌ష్టంగానే ప్ర‌క‌టించార‌ని చెప్పాలి.