Begin typing your search above and press return to search.
తిరుమలలో మోడీ.. జగన్ రహస్య భేటీ!
By: Tupaki Desk | 10 Jun 2019 12:33 PM ISTతిరుపతి పర్యటన సందర్భంగా ఆసక్తికర అంశం ఒకటి చోటు చేసుకుంది. మీడియా దృష్టిని పెద్దగా ఆకర్షించిన ఈ అంశం బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లమధ్య ఆసక్తికర చర్చకు కారణమైంది. శ్రీలంక నుంచి తిరుపతికి వచ్చిన మోడీ.. తిరుమల శ్రీవారి దర్శనాన్ని చేసుకోవటం తెలిసిందే.
స్వామి దర్శనం తర్వాత.. తిరుమల నుంచి తిరుపతికి తిరిగి వెళ్లే ముందు.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రధాని మోడీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిల మధ్య రహస్య సమావేశం జరిగినట్లుగా చెబుతున్నారు. బీజేపీకి చెందిన నేతలతో పాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఎవరూ ఈ మీటింగ్ లో పాల్గొనలేదని.. పూర్తిగా ఇరువురు నేతల మధ్య వన్ టు వన్ మీటింగ్ గా చెబుతున్నారు.
ఈ సమావేశంలో చర్చించిన విషయాలు ఏవీ బయటకు రాలేదు. మీడియాలోనూ పెద్దగా ఫోకస్ కాలేదు. అయితే.. ఈ సమావేశం ఎక్కువ సేపు సాగలేదని.. చాలా తక్కువ వ్యవధిలోనే ముగిసినట్లుగా చెబుతున్నారు. శ్రీపద్మావతి గెస్ట్ హౌస్ లో ఈ మీటింగ్ జరిగినట్లుగా సమాచారం.