Begin typing your search above and press return to search.

ఈ విష‌యంలో జ‌గ‌న్‌-కేసీఆర్ ఒక్క‌టే.. ఎంత దారుణ‌మో తెలుసా?

By:  Tupaki Desk   |   13 April 2021 7:00 AM IST
ఈ విష‌యంలో జ‌గ‌న్‌-కేసీఆర్ ఒక్క‌టే.. ఎంత దారుణ‌మో తెలుసా?
X
ఏపీ-తెలంగాణ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్‌, కేసీఆర్‌లు కొన్ని కొన్ని విష‌యాల్లో త‌మ‌కు తామే సాటి అనిపించుకునేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. క‌రోనా రెండో ద‌శ వ్యాప్తి.. రెండు రాష్ట్రాల‌ను ఇబ్బంది పెడుతోంది. ఏపీ, తెలంగాణ‌లో ఈ వ్యాప్తిలో పోటీ ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో కేంద్రం నుంచి వ‌స్తున్న ఆదేశాలు, నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేయాల‌న్న‌.. ప్ర‌ధాని సూచ‌న‌లను.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల నేత‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ఒక్క విష‌యంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌దీ ఒకే విధానంగా ఉంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం సాగ‌ర్‌లోను, తిరుప‌తి పార్ల‌మెంటుకు ఉప ఎన్నిక జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా నిబంధ‌న‌లు అమలు చేయ‌డంలో జ‌గ‌న్ స‌ర్కారు.. వెనుక‌డుగు వేస్తోంది. ఇక‌, సాగ‌ర్‌లో ఎన్నిక‌లు ఉండ‌డంతో కేసీఆర్ సైతం క‌రోనా ను ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే.. తెలంగాణ హైకోర్టు సీరియ‌స్ అవ‌డంతో మాస్కుల నిబంధ‌న‌ను తీసుకువ‌చ్చారు. అంతేకానీ.. భౌతిక దూరం నిబంధ‌న‌ను పాటించాలంటూ.. ప్ర‌భుత్వం నుంచి ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. అదైనా.. హైకోర్టు ఆదేశాల‌తోనే కేసీఆర్ ప్ర‌భుత్వం ముందుకు క‌దులుతోంది. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ప్ర‌చారం చేయాల‌ని అనుకున్న జ‌గ‌న్‌.. అక్క‌డ రాజ‌కీయ కార‌ణాల‌తో వెనుక‌డుగు వేశారు.

కానీ, తాను ప్ర‌చారానికి వెనుక‌డుగు వేయ‌డం వెనుక క‌రోనా తీవ్ర‌త‌ను కార‌ణంగా చూపిస్తూ.. ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ సంధించారు.కానీ, ఇది నిజ‌మే అయితే.. తాజాగా ఆయ‌న వ‌లంటీర్ల‌కు స‌న్మాన కార్య‌క్ర‌మం ఎందుకు నిర్వ‌హించారు? పోనీ.. ఇక్క‌డేమైనా క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించారా? పైగా ముఖ్య‌మంత్రే మాస్కు పెట్టుకోకుండా.. స‌భ‌లో గ‌డిపారు. ఈ విజువ‌ల్స్ సోష‌ల్ మీడియాలోనూ ప్ర‌సారం అయ్యాయి. అంటే.. ఈ రెండు ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కూడా రాజ‌కీయాలే ప్ర‌ధానం త‌ప్ప‌.. ప్ర‌జ‌లు, ప్ర‌జారోగ్యం ముఖ్యం కాద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. పైగా ల‌క్ష మందితో తాను స‌భ పెట్టితీరుతాన‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేయ‌డం కూడా వివాదానికి కేంద్రంగా మారింది. వెర‌సి.. ఇరు రాష్ట్రాల తెలుగు సీఎంల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.