Begin typing your search above and press return to search.

జగన్ - కేసీఆర్ లకు ఎన్టీఆర్ ఆశీర్వాదం!

By:  Tupaki Desk   |   28 May 2020 5:20 PM IST
జగన్ - కేసీఆర్ లకు ఎన్టీఆర్ ఆశీర్వాదం!
X
తెలుగు దేశం పార్టీ నుంచి విడిపోయి ఆ పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఇక జగన్ కూడా ప్రతిపక్ష టీడీపీకి వ్యతిరేకంగానే వైసీపీని స్థాపించారు. ఈ ఇద్దరు టీడీపీ వ్యతిరేకులు ఇప్పుడు రెండు రాష్ట్రాలను పాలిస్తూ స్నేహంగా ఉంటున్నారు. అయితే చంద్రబాబుకు ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరికి తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు ఆయన భార్య., ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి. జగన్, కేసీఆర్ లకు ఎన్టీఆర్ ఆశ్వీరాదం ఉంటుందని ఆమె చెబుతున్నారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో తన దివంగత భర్త ఎన్టీఆర్ సమాధికి పూలమాలలు వేసి లక్ష్మీపార్వతి నివాళులర్పించారు.పేదలకు సేవ చేయాలన్న ఎన్టీఆర్ ఆకాంక్షలను నెరవేర్చిన వారికి.. తెలుగు వారి గౌరవాన్ని నిలబెడుతున్న వారికి ఎన్టీఆర్ ఆశీర్వాదం ఉంటుందని లక్ష్మీపార్వతి అన్నారు.

‘ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రెండింటిలోనూ ఇప్పుడు ఎన్టీఆర్ నిజమైన అనుచరులు అయిన ముఖ్యమంత్రులు ఉండటం అదృష్టం. జగన్, కెసిఆర్ ఇద్దరూ ఎన్టీఆర్ ఆదర్శాలను నెరవేరుస్తున్నారు ”అని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. ఏపీలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ కలలను జగన్ సాకారం చేస్తున్నారని.. తెలంగాణ ప్రజల ఆశలు తీరుస్తూ కేసీఆర్ అక్కడి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించారని లక్ష్మీపార్వతి అన్నారు.