Begin typing your search above and press return to search.
ఢిల్లీ వెళ్లగానే రేటు పెరిగిపోయిందేంటి జగన్?
By: Tupaki Desk | 26 April 2016 12:59 PM ISTస్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ మాదిరే ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ నోటి మాటలు కూడా అదే రీతిలో విపరీతమైన మార్పులకు చోటు చేసుకుంటున్నాయి. సేవ్ డెమోక్రసీ అంటూ.. ఏపీ అధికారపక్షం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు వ్యతిరేకంగా గళం విప్పిన జగన్ మాటలు కాస్త చిత్రంగా ఉన్నాయి. తన ఢిల్లీ పర్యటన ముందు.. తమ పార్టీ ఎమ్మెల్యేల్ని సైకిల్ ఎక్కించేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు చంద్రబాబు బేరం పెడుతున్నట్లుగా జగన్ ఆరోపించటం తెలిసిందే.
నిజానికి 20కోట్లకు కోట్లకు మధ్య అంతరమే పది కోట్లు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిజానికి తమ ఎమ్మెల్యేల్ని ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారన్న విషయం జగన్ కు తెలుసా? అన్నది సందేహం కలగక మానదు. ఎందుకంటే.. ఆయన చెబుతున్న ధరల మద్య అంతరం భారీగా ఉండటమే కారణం. ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్.. ఏపీ ముఖ్యమంత్రి తీరును ఎండగడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేల్ని ఏపీ ముఖ్యమంత్రి రూ.40 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఏపీలో రూ20 నుంచి రూ.30 కోట్ల వరకు బేరం చేస్తున్నారని ఆరోపించిన జగన్.. ఢిల్లీకి వెళ్లగానే ఈ ధరను రూ.40 కోట్లకు పెంచేయటం గమనార్హం. స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ మాదిరి.. జగన్ పార్టీ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు ఏపీ అధికారపక్షం కోట్లకు కోట్లకు పెంచుకుంటూ పోతుందా? అన్నది ఒక ప్రశ్న. ఇంతకీ ఏపీలో చెప్పిన ధరకు.. ఢిల్లీలో జగన్ చెబుతున్న ‘ఎమ్మెల్యేల కొనుగోలు ధర’ అంతగా ఎలా పెరిగిపోయింది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే వారు ఎవరు?