Begin typing your search above and press return to search.

‘గీతం’ వర్సిటీ అక్రమాల పై సీబీఐకి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   26 Oct 2020 3:00 PM GMT
‘గీతం’ వర్సిటీ అక్రమాల పై సీబీఐకి ఫిర్యాదు
X
గీతం యూనివర్సిటీ ఆక్రమణలను ఇటీవల జగన్ సర్కార్ కూల్చివేయడం రాజకీయంగా దుమారం రేపింది. దీన్ని ప్రతిపక్ష టీడీపీ ఖండించింది. ఈ క్రమంలోనే తాజాగా గీతం యూనివర్సిటీ భూకబ్జాలపై విచారణ జరపాలని సోమవారం ప్రజాసంఘాల జేఏసీ ‘సీబీఐ’కి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

ఈ ఫిర్యాదులో గత 40 ఏళ్లుగా గీతం యూనివర్సిటీ భూకబ్జాలకు పాల్పడిందని.. వారు ఆక్రమించిన భూముల్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారని.. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజు అధికంగా వసూలు చేశారని ప్రజా సంఘాల జేఏసీ ఆరోపించింది.

భూకబ్జాలు, అవినీతికి పాల్పడిన గీతం యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని.. చేసిన మోసాలను రాజకీయ పలుకుబడితో గీతం యూనివర్సిటీ పెద్దలు తప్పించుకుంటున్నారని జేఏసీ ఆరోపించింది.

గీతం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని.. గీతం వర్సిటీ అక్రమాలకు చంద్రబాబు మద్దతు తెలుపడాన్ని ఖండిస్తున్నామని ప్రజాసంఘాల జేఏసీ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ప్రభుత్వం, ప్రతిపక్షాల నడుమ వివాదంగా మారిన ఈ ఇష్యూలోకి తాజాగా ప్రజాసంఘాలు కూడా రావడంతో గీతం వర్సిటీ భూ ఆక్రమాలపై ప్రభుత్వ వాదనకు బలం చేకూరినట్టైంది. ఈ క్రమంలోనే సర్కార్ ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.