Begin typing your search above and press return to search.

ఏంత మాట? కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ తప్పారన్న నడ్డా

By:  Tupaki Desk   |   5 Jan 2022 4:30 AM GMT
ఏంత మాట? కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ తప్పారన్న నడ్డా
X
గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పొలిటికల్ ఫార్ములా మొదలైంది. జాకీలు తెచ్చినా.. తెలంగాణలో బీజేపీ పట్ల సానుకూల ధోరణి పెరగదన్న మాటలు వినిపించే వేళ.. తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కమలనాథుల తీరుపై సానుకూలత పెరిగిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అన్నింటికి మించి ఆదివారం రాత్రి వేళలో.. కరీంనగర్ లోని తన పార్టీ ఆఫీసు లోపలకు వెళ్లి .. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఏ తీరులో అరెస్టుచేశారో తెలిసిందే. ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ జిల్లా జైల్లో ఉండటం తెలిసిందే.

కేంద్రంలో కొలువు తీరిన జాతీయ పార్టీకి సంబంధించిన ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని పోలీసులు అరెస్టు చేయటం.. అది కూడా సరైన నిర్ణయం లేకుండానే అన్న మాట వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన జీవో నెంబరు 3127 అమలుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దీక్ష చేయటం.. దీన్నిభగ్నం చేయటానికి పోలీసులు ఏ తీరులో వ్యవహరించారో చూసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయనకు రిమాండ్ విధించిన పద్నాలుగు రోజులు.. ఏదో ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నాయకత్వం డిసైడ్ చేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. హైదరాబాద్ లో అడుగు పెట్టటమే కాదు.. తమను అడ్డుకుంటున్న టీఆర్ఎస్ సర్కారుపై కడిగిపారేశారు. శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ కు వెళ్లిన ఆయన.. అక్కడ నుంచి పార్టీ ఆఫీసుకు వెళ్లటం.. విలేకరులతో మాట్లాడటం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక.. హుజూరాబాద్ ఓటమితో కేసీఆర్ర మానసిక పరిస్థితి దెబ్బ తిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు.

తమది క్రమశిక్షణ పార్టీ అని.. కరోనా నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ నిరసన తెలిపామని.. తనను ఎయిర్ పోర్టు వద్దనే అడ్డుకున్నారన్నారు. కరోనా నిబంధనలకు తగ్గట్లే తాము వ్యవహరించామని చెప్పి ప్రోగ్రాంలో పాల్గొన్నట్లు చెప్పారు. తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందన్న ఆయన.. తెలంగాణలో అవినీతి.. కుటుంబ పాలన నడుస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని.. బండి సంజయ్ పై పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ పై పోరాడేది బీజేపీ మాత్రమేనన్న ఆయన.. జీవో 317ను సవరించే వరకు తమ పార్టీ పోరాడుతూనే ఉందన్నారు. ఆయన ఇంకేం అన్నారంటే..

- తెలంగాణ ప్రజల తరఫున బీజేపీ చేపట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాను. తెలంగాణ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం.

- బండి సంజయ్ జీవో 317 ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల వ్యతిరేక ఉత్తర్వులను సవరించాలని పోరాడారు. తెలంగాణ మంత్రులు ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతియుతంగా జాగరణ దీక్ష చేపడితే పోలీసులు బండి సంజయ్‌పై మ్యాన్ హ్యాండిల్ చేశారు.

- కేసీఆర్ తీరుపై సిగ్గుపడుతున్నాం. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంలా మారింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఒక్క చుక్క నీరు రాలేదు.

- వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు గా ఉంది కేసీఆర్ తీరు. బండి సంజయ్ అరెస్ట్‌ను జాతీయ పార్టీ ఖండిస్తుంది... ప్రజాస్వామ్య యుతంగా పోరాటం చేస్తాం.

- తెలంగాణలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని, దేశంలో అత్యంత అవినీతికర రాష్ట్రంగా తెలంగాణను మార్చారు.