Begin typing your search above and press return to search.

అమరావతి - బోట్స్ వానా దేశానికి లింకేంటి?

By:  Tupaki Desk   |   2 Jan 2020 5:55 PM IST
అమరావతి - బోట్స్ వానా దేశానికి లింకేంటి?
X
ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. ఏపీకి 3 రాజధానుల ప్రతిపాదనపై స్పందించిన ఆయన ఆఫ్రికా దేశంలోని బోట్స్ వానా రాజధాని ప్రస్తావన తీసుకొచ్చి ఆసక్తికర ట్వీట్లు చేశారు.

ఆఫ్రికాలోని బోట్స్ వానాలో ఒక తెగ ఆదిపత్యంతో మొదట మాఫకింగ్ అనే చోట రాజధాని ఏర్పాటు చేశారని.? ఆ తెగల మధ్య రాజధానిపై గొడవ జరిగిందని.. 1969లో అందరికీ ఆమోదయోగ్యమైన గబరోసి రాజధాని మార్చారని ఐవైఆర్ ట్వీట్ చేశారు.

అలాగే ఏపీలోనూ అమరావతి రాజధాని ప్రాంతంలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారి ఆధిపత్యం ఉందని.. దాన్ని అందరి ఆమోదయోగ్యమైన ప్రాంతానికి మార్చాలని ఐవైఆర్ ట్వీట్ ద్వారా సూచించారని తెలుస్తోంది.

ఇక భారత పశ్చిమ తీరానికి ముంబై ముఖద్వారంగా ఉంటే.. ఉత్తర తీరానికి విశాఖ నగరం అలా ఉందని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ‘ఎవరి రాజధాని అమరావతి’ అని తాను రాసిన పుస్తకం లింక్ ను ఇచ్చి చదవమని అసమ్మతికారులకు ఐవైఆర్ ట్విట్టర్లో సూచించారు.