Begin typing your search above and press return to search.

ఐలయ్యను సోమరిపోతుల అడ్రస్ లు ఇవ్వమంటున్నారు

By:  Tupaki Desk   |   16 May 2016 7:00 AM GMT
ఐలయ్యను సోమరిపోతుల అడ్రస్ లు ఇవ్వమంటున్నారు
X
తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ మీడియాలో కనిపించే ప్రొఫెసర్ కంచె ఐలయ్యకు ఎప్పుడూ ఎదురుకాని చిత్రమైన అనుభవం ఎదురైందని చెప్పాలి. ఆయన తాజాగా ఒక సదస్సులో పాల్గొని బ్రాహ్మణుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. బ్రాహ్మణులు సోమరిపోతులంటూ ఆయన విపరీత వ్యాఖ్యలకు తెగ బడ్డారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగింది.

ఇదిలా ఉంటే.. ఐలయ్య వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పని చేసి.. ప్రస్తుతం బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తున్న ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. బ్రాహ్మణులు తిని కూర్చునే సోమరులుగా అభివర్ణించిన ఐలయ్య మాటల్ని తప్పు పట్టిన ఆయన.. అలాంటి వారి అడ్రస్ లు తమకు ఇవ్వాలంటూ ఐలయ్యకు సవాలు విసిరారు.

తాను 35 ఏళ్లు ప్రభుత్వంలో పని చేశానని.. ఏనాడు సోమరిపోతునని తాను అనిపించుకోలేదని మండిపడ్డారు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులు ఎవరూ సోమరిపోతులు కాదని.. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే వారి అడ్రస్ లు ఇవ్వాలన్నారు. బ్రాహ్మణులు వారి రంగాల్లో నిత్య శ్రామికులుగా అభివర్ణించిన ఐవైఆర్ సవాలుకు కంచె ఐలయ్య రియాక్ట్ అవుతారా? తన మాటల్లో చెప్పినట్లుగా సోమరిపోతులైన బ్రాహ్మణుల అడ్రస్ లు ఇస్తారా?