Begin typing your search above and press return to search.

ఐవర్‌మెక్టిన్.. హైడ్రోక్లోరోక్విన్.. ఫావిపిరావిర్‌లపై షాకింగ్ నిర్ణయం

By:  Tupaki Desk   |   8 Jun 2021 3:37 AM GMT
ఐవర్‌మెక్టిన్.. హైడ్రోక్లోరోక్విన్.. ఫావిపిరావిర్‌లపై షాకింగ్ నిర్ణయం
X
కరోనాతో ఇబ్బంది పడేవారు ఏం మందులు వాడాలన్న దానిపై ఉన్నంత కన్ఫ్యూజన్ అంతా ఇంతా కాదు. కొన్ని మందుల వాడకంపై డాక్టర్ల మధ్యనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇంతకాలం కొవిడ్ కు చెక్ పెట్టేందుకు వాడిన ఔషధాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కొవిడ్ రోగులు వాడాల్సిన ఔషధాలపై ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలకు మార్పులు చేశారు.
ఇందులో భాగంగా ఇప్పటికే వాడుతున్న ఐవర్ మెక్టిన్.. హైడ్రోక్లోరోక్విన్ ను పక్కన పెట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందించే కరోనా మందుల కిట్ లో హైడ్రోక్లోరోక్విన్ కూడా ఉంటుంది. తాజాగా మాత్రం ఆ ఔషధాన్ని వాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేయటం షాకింగ్ గా మారింది.

కరోనా రోగులకు ఐవర్ మెక్టిన్.. హైడ్రోక్లోరోక్విన్ తో పాటు ఫావిపిరావిర్ ను కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆరోగ్య శాఖ వీటిని వాడొచ్చని చెబుతుంటే.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మాత్రంఅందుకు భిన్నంగా వీటిని వాడొద్దని చెబుతోంది. ఈ మందుల్నికొవిడ్ రోగులు వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు తేల్చి చెప్పటంతోనే.. వీటిని కొవిడ్ మేనేజ్ మెంట్ ను తొలగించినట్లుగా చెబుతున్నారు.

కొత్తగా వచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. లక్షణాలు లేని రోగులకు ఎలాంటి మెడికేషన్ అవసరం లేదని.. స్వల్ప లక్షణాలు ఉన్న వారు యాంటీపైరేటిక్.. మాంటీటసివ్ ఉపయోగించొచ్చని చెప్పింది. దగ్గుతో బాధ పడుతున్న వారు 800 ఎంసీజీ బుడెసోనైడ్ ను ఇన్హేలర్.. స్పేస్ డివైజ్ ద్వారా రోజుకు రెండుసార్లు చొప్పున ఐదు రోజులు తీసుకోవచ్చంటున్నారు. అంతే కాదు.. మొన్నటి వరకు విపరీతంగా వాడిని రెమ్డెసివిర్ ను సైతం ఎంపిక చేసిన కేసుల్లో మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు.

ఒక మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారికి దీన్ని ఉపయోగించొచ్చని చెబుతున్నారు. పది రోజుల్లోపు ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న వారికి దీన్ని వాడొచ్చంటున్నారు. ఇక.. టోసిలీజుమాబ్ ను తీవ్ర.. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారికి మాత్రమే వినియోగించాలని చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. ఇప్పుడు లిస్టులో నుంచి తీసేశారు సరే.. మరి ఇప్పటివరకు వాటిని వాడినోళ్ల సంగతేంటి? అన్న సందేహానికి సైతం సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందన్నది మర్చిపోకూడదు.