Begin typing your search above and press return to search.

ట్రంప్ సీట్లో కూర్చున్న ఇవాంకా

By:  Tupaki Desk   |   9 July 2017 5:39 AM GMT
ట్రంప్ సీట్లో కూర్చున్న ఇవాంకా
X
వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తుంటారు అమెరికా అధ్య‌క్షులు డొనాల్డ్ ట్రంప్‌. త‌న మాట‌ల‌తో.. చేత‌లతో ఇప్ప‌టికే ప‌లుమార్లు వార్త‌ల్లోకి ఎక్కిన ఆయ‌న స్థానంలో తాజాగా కుమార్తె ఇవాంకా ట్రంప్ వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఒక అంత‌ర్జాతీయ వేదిక మీద అమెరికా అధ్య‌క్ష స్థానంలో కూర్చున్న తండ్రి బ‌య‌ట‌కు వెళ్లగా ఆమే స్వ‌యంగా వెళ్లి కూర్చోవ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ప్ర‌తిష్ఠాత్మ‌క జీ 20 స‌ద‌స్సు జ‌ర్మ‌నీలోని హాంబ‌ర్గ్ వేదిక‌గా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి చైనా.. ర‌ష్యా.. జ‌ర్మ‌నీ.. ఫ్రాన్స్.. భార‌త ప్ర‌ధాని.. స‌హా ప‌లువురు దేశాధినేత‌లు హాజ‌రయ్యారు. ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడు ఆఫ్రికా అభివృద్ధి అంశంపై మాట్లాడుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ లేచి బ‌య‌ట‌కు వెళ్లారు. ఆ వెంట‌నే ట్రంప్ కూర్చున్న కుర్చీలో ఆమె కుమార్తె ఇవాంకా వెళ్లి కూర్చోవ‌టం వివాదంగా మారింది.

అత్యున్న‌త దౌత్య‌వేత్త‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో పాల్గొన్న ఇవాంకా.. తండ్రి బ‌య‌ట‌కు వెళ్ల‌గానే కుమార్తె కూర్చోవ‌టం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో బంధుప్రీతి చూపిస్తున్నారంటూ ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై వైట్ హౌస్ స్పందించింది.

స‌ద‌రు స‌ద‌స్సుతో ట్రంప్ తో స‌హా ప‌లువురు దేశాధినేత‌లు పాల్గొన‌లేద‌ని.. వారిస్థానాల్లో వారి ప్ర‌తినిధులు కూర్చున్నార‌ని.. ఇవాంకా వారిలో ఒక‌రిగా కూర్చున్నారే త‌ప్పించి మ‌రింకేమీ లేద‌ని స్ప‌ష్టం చేసింది. డొనాల్డ్ వ్య‌వ‌హారాల్ని ఆమె కుమార్తె చ‌క్క‌బెడుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌తినిధిగా ఇవాంకా కూర్చున్నార‌ని వెల్ల‌డించింది. ఏమైనా అధ్య‌క్షుడు ప్ర‌తినిధిగా ఆమె కుమార్తె కూర్చోవ‌టాన్ని ప‌లువురు అంగీక‌రించ‌టం లేదు.