Begin typing your search above and press return to search.

ఇవాంకా నోట తండ్రి కోసం సైకిల్ తొక్కిన జ్యోతి మాట

By:  Tupaki Desk   |   23 May 2020 5:00 AM GMT
ఇవాంకా నోట తండ్రి కోసం సైకిల్ తొక్కిన జ్యోతి మాట
X
ఇప్పుడున్నది డిజిటల్ యుగం. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా.. గంటల వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టేసే పరిస్థితి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతమే నిదర్శనం. లాక్ డౌన్ వేళ.. సొంతూరు వెళ్లేందుకు.. గాయంతో బాధ పడుతున్న తండ్రిని సైకిల్ వెనుక కూర్చోబెట్టుకొని ఏడురోజుల్లో 1200 కి.మీ. నడిపిన వైనం ఇప్పుడు పెను వైరల్ గా మారింది. ఈ బిహారీ బాలికపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చివరకు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమె ప్రతిభను మెచ్చుకోవటమే కాదు.. ఆమెను ట్రయల్స్ కు రావాలని ఆహ్వానించింది కూడా.

ఇదిలా ఉంటే.. జ్యోతి ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక తాజాగా స్పందించారు. జ్యోతి మీద పబ్లిష్ అయిన కథనానికి ఆమె రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో జ్యోతి ఉదంతాన్ని ప్రస్తావించిన ఇవాంక.. గాయంతో ఉన్న తండ్రిని సైకిల్ వెనుక కూర్చోబెట్టుకొని.. ఏడు రోజుల్లో 1200కి.మీ. ప్రయాణించిన వైనానికి భావోద్వేగంతో కదిలిపోయారు.

ఆ అందమైన ఓర్పు.. ప్రేమ భారతీయ సమాజాన్నే కాదే సైక్లింగ్ ఫెడరేషన్ ను కూడా ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఈ ఉదంతం భారత్ లో వలస కార్మికులు ఎన్ని కష్టాలు పడుతున్నారన్న విషయాన్ని తెలియజేయటమే కాదు.. లాక్ డౌన్ వేళ.. మోడీ సర్కారు ఫెయిల్ అయిన అంశం ఏమిటో కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసిందని చెప్పక తప్పదు.