Begin typing your search above and press return to search.

కెనడా ప్రధానిపై కన్నేసిన ట్రంప్ కూతురు

By:  Tupaki Desk   |   17 Feb 2017 9:38 AM GMT
కెనడా ప్రధానిపై కన్నేసిన ట్రంప్ కూతురు
X
ఇవాంకా ట్రంప్.. ఈ పేరు వినగానే అర్థమైపోతుంది ఆమె ఎవరో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు. అంతేకాదు.. అదిరిపోయే అందగత్తె. తండ్రిలాగే బంగారు రంగు జుత్తు, పైగా నయాగరా జలపాతంలా ఉరకలేస్తూ భుజాలపైన జాలువారుతూ ముంగుర్లపై గింగిర్లు తిరుగుతూ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంటాయి. మన కాళిదాసు నుంచి కామన్ కవుల వరకు అందరూ వర్ణించే సంపెంగ పువ్వు లాంటి ముక్కు.. కలువల్లాంటి కళ్లతో పాటు డబుల్ కా మీఠా పెదవులు.. వెండి మబ్బుల్లాంటి మిగతా సొగసులతో మతిపోగొట్టే అందం ఆమెది.

ఈ సోది కవిత్వం మాకెక్కదు అనే డిజిటల్ యుగం కుర్రకారు కోసమైతే ఆమె అందాన్ని అంకెల్లో కూడా చెప్పుకున్నా తక్కువేమీ కాదు. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు.. హైట్ కు తగ్గట్లు 64 కేజీల బరువు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరు దర్శకులు, హీరోలు కోరుకునే 38-26-36 పర్ఫెక్ట్ కొలతలతో మంచి బాడీ స్టేటిస్టిక్సు ఉన్న ఫిగర్ ఇవాంకాది.

ఇంతకీ ఇవన్నీ ఎందుకంటే ఇంత గొప్ప అందం రీసెంటుగా పొరుగు దేశం అధ్యక్షుడిని చూసి ఫ్లాటయిపోయిందట. అంతేకాదు.. ఆయన్ను కన్నార్పకుండా చూస్తూ తెగ ఇబ్బందిపెట్టేసిందట. ఇంతకీ ఆయనెవరో కాదు, అమెరికా పక్కనే ఉన్న కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడీ. మనోడు ఇవాంకాకు తెగ నచ్చేయడానికి కారణాలు కనిపిస్తున్నాయి. హాలీవుడ్ హీరోలా కనిపించే ట్రూడీ క్లీన్ షేవ్ తో సున్నితంగా కనిపించినా సూపర్ హిట్ ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే శోభన్ బాబు లాంటి అందగాడు. ఇంకేముంది.. అమెరికా అధ్యక్షుడి కూతురిని అని కూడా మరిచిపోయి ఈవిడగారు ఆయన్ని చూపుల్తోనే తినేసిందట. ఇవాంకా చూపులకు ట్రూడీ పాపం తెగ సిగ్గుపడిపోయాడు.

అక్కడితో ఆగిందా.. ఆ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేంది. ఇదంతా అమెరికా అధ్యక్షుడి అధికార కార్యాలయమైన ఓవల్‌లో జరిగిన సీను. ఇవాంకా.. ట్రూడీని ఏమట చేసుకోనీ కానీ అందులో ఒక ఫొటో మాత్రం విమర్శలకు దారితీసింది. అదేంటంటే... ట్రంప్ కుమార్తె ఇవాంకా సీటులో కూర్చోగా డోనాల్డ్‌ ట్రంప్ పాటు జస్టిన్ ట్రూడీ కూడా ఆమె పక్కేనే చెరోవైపు నిల్చుని ఫొటోలు దిగారు. ఇద్దరు దేశాధ్యక్షులను పక్కనే నిల్చోబెట్టుకుని తాను మాత్రం కాలుమీద కాలేసుకుని నవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

మరి.. ఇవాంకా చూపులే అంతా? లేదంటే ట్రూడీతో ఆమె సంథింగ్ సంథింగ్ కోరుకుంటోందో తెలియాలి. ప్రస్తుతం ఆమె పటిష్టమైన వైవాహిక జీవితంలోనే ఉంది. 2007 నుంచి రెండేళ్ల పాటు బిజినెస్ మేన్ జేరెడ్ కుష్నర్ తో డేటింగ్ చేసి 2009లో ఆయన్ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఆయనతోనే జీవిస్తోంది. ఇప్పుడు కెనడా ప్రధానిపై ఏర్పడిన కొత్త మోజు ఈ బంధంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఒకవేళ ఇవాంకా మోజు ఇలాగే కొనసాగి పొరపాటును పెళ్లిగిళ్లీ చేసుకుంటే మాత్రం అమెరికా అధ్యక్షుడికి కెనడా ప్రధాని అల్లుడైపోతాడు. అప్పుడు ట్రంప్ ఏం రాసిచ్చేస్తాడో ఏమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/