Begin typing your search above and press return to search.

ట్రంప్ ఫ్యామిలీ ఫ్యామిలీ అక్క‌డ దిగిపోయింది

By:  Tupaki Desk   |   30 March 2017 11:45 AM GMT
ట్రంప్ ఫ్యామిలీ ఫ్యామిలీ అక్క‌డ దిగిపోయింది
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న అధికారిక నివాసంలో కుటుంబానికి పెద్ద పీట వేస్తున్నారు. ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఇప్పుడు వైట్‌ హౌజ్‌ లో ఉద్యోగిగా మార‌నున్నారు. అయితే వేత‌నం తీసుకోకుండానే ఆమె సేవ‌లు అందించ‌నున్నారు. ప్రెసిడెంట్‌ కు అసిస్టెంట్‌ గా ఇవాంకా ట్రంప్‌ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించే అవ‌కాశాలున్నాయి. ఇవాంకా భ‌ర్త జారెడ్‌ కుష్న‌ర్ కూడా ప్రెసిడెంట్ ట్రంప్‌ కు సీనియ‌ర్ అడ్వైజ‌ర్‌ గా ఉన్నారు.

అసాధార‌ణ బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు ఇవాంకా సిద్ద‌మైంద‌ని వైట్‌ హౌజ్ పేర్కొన్న‌ది. అయితే కుష్న‌ర్ నియ‌మాకం అప్పుడే ట్రంప్ తీరుపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. బందుప్రీతి చ‌ట్టాల‌ను ఉల్లంఘించార‌ని విమ‌ర్శించారు. అయితే వైట్‌ హౌజ్‌ లో అలాంటి నియ‌మాలు ఏవీ ఉండ‌వ‌ని న్యాయ‌శాఖ స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం వైట్‌ హౌజ్ వెస్ట్‌ వింగ్‌ లో ఉన్న కుష్న‌ర్‌ కార్యాల‌యంపైనే ఇవాంకా ఆఫీసును స్టార్ట్ చేశారు. ప్ర‌భుత్వ క్లియ‌రెన్స్ ఉన్న అని క‌మ్యూనికేష‌న్ ప‌రిక‌రాలు ఇప్పుడు ఆమె ఆఫీసులో ఏర్పాటు చేయ‌నున్నారు.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ కీల‌క భూమిక పోషించారు. 35 ఏళ్ల ఇవాంకా ఎన్నికల ప్రచార సమయంలో త‌న తండ్రి అధ్యక్షుడైతే అమెరికాను ఎలా మార్చబోతున్నారో వివరించి ఆకట్టుకున్నారు. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాల‌నుకుంటుందీ, పిల్లల సంర‌క్షణ‌-మ‌హిళ‌ల‌కు స‌మాన వేత‌నం లాంటి కీల‌క అంశాల‌పై మ‌న‌సుకు హ‌త్తుకునేలా ప్రసంగించారు. ట్రంప్ అధ్యక్ష బ‌రిలో నిల‌వాల‌నుకున్నప్పటి నుంచి ఎన్నిక‌ల‌ వ్యూహాలు, ఖ‌ర్చుల‌పై భ‌ర్త జారెడ్ కుష్నర్‌ తో క‌లిసి త‌ర‌చూ ప్రణాళిక‌లు ర‌చించారు. అందుకే ఇవాంకాను ట్రంప్ సీక్రెట్ ఆయుధంగా మీడియా అభివర్ణించింది. ట్రంప్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌యిన త‌ర్వాత ఇవాంక కీల‌క‌మైన పాత్ర పోషించ‌నున్నారనే వార్తలు జోరందుకున్నాయి. అనుకున్న‌ట్లుగానే వైట్ హౌజ్ లో చిన్న మేడమ్ అనధికార టైటిల్ తోనే కీలక పనులు కానిచ్చేస్తున్నారని టాక్ వినిపించింది. ఈ న్యూస్ కు ఊతమిస్తూ ఇవాంకా కొన్ని రోజుల క్రితమే ట్రంప్ నిర్వహించిన వ్యాపారవేత్తల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. అంతేకాక యెమెన్ లో మృత్యువాతపడిన సైనికుడి జ్ఞాపకార్ధం నిర్వహించిన సభకు తండ్రితో పాటే హాజరయ్యారు. తన పలుకుబడి ఉపయోగించి శ్వేతసౌధంలో సీఈఓలతో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూస్తుంటే అధినేత తర్వాతి రోల్ ఇవాంకా పోషిస్తున్నారని, ప్రథమ మహిళ మెలానియా సైతం వైట్ హౌజ్ పై ఇంతటి గ్రిప్ సాధించలేకపోయారని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/