Begin typing your search above and press return to search.

ట్రంప్ కూతురుతో కాఫీ ఎంత కాస్ల్టీ అంటే..

By:  Tupaki Desk   |   17 Dec 2016 10:53 AM IST
ట్రంప్ కూతురుతో కాఫీ ఎంత కాస్ల్టీ అంటే..
X
తమది సామాన్యుడి పార్టీ అంటూ.. ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసి.. తమ పార్టీకి అవసరమైన నిధుల సేకరణ కోసం ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. తనతోకలిసి కాఫీ తాగటానికి.. లంచ్ చేయటానికి.. డిన్నర్ చేసేందుకు రేట్లను డిసైడ్ చేసి మరీ.. కోట్లాది రూపాయిలు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో తాజాగా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్ ఫ్యామిలీ ఇదే పని మొదలెట్టింది. కాకుంటే.. ఒక స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూర్చేందుకు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తనతో కాఫీకి ఆఫర్ ఇచ్చింది.

ఇందుకోసం బిడ్ ను ఏర్పాటు చేశారు. ఎవరైతే అత్యధిక మొత్తంలో బిడ్ వేస్తారో.. వారితో ఇవాంకా కాఫీ తాగుతారు. కాఫీ విత్ ఇవాంకా పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. అమెరికాకు కొత్తగా అధ్యక్షుడయ్యే వ్యక్తి కుమార్తెతో పరిచయం తమ వ్యాపారాలకు మరింత లాభాన్ని చేకూరుస్తుందన్న భావనతో పాటు.. అధ్యక్షుడి కుటుంబంతో పరిచయాన్ని మిస్ కాకూడదని భావిస్తున్నారట.

ఇంతకీ కాఫీ విత్ ఇవాంకా కార్యక్రమం ఎందుకంటే.. ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ అధ్వర్యంలో నడిచే ‘‘సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ ఆఫ్ టెన్నెస్సీ’’కి విరాళాలు సేకరించాలన్నదే లక్ష్యం. ఇక.. ఇవాంకాతో కాఫీ తాగేందుకు దేశ విదేశీ వ్యాపారస్తులు పోటాపోటీగా బిడ్ లు వేయటం ఆసక్తికరంగా మారింది. లండన్ కేంద్రంగా పని చేసే బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్ ఓజాన్ ఒజ్కురల్ ఏకంగా రూ.40లక్షలకు బిడ్ వేస్తే.. అమెరికాకు చెందిన రెస్టారెంట్ చైన్ టెక్స్ – మెక్స్ అధినేత రస్సెల్ వైబర్రా రూ.46 లక్షల బిడ్ వేశారు.

ఇదే తీరులో మరికొన్ని సంస్థలు బిడ్ లు వేయటం గమనార్హం. ఇప్పటివరకూ నమోదైన బిడ్లు రూ.50లక్షల వరకూ వేయటం గమనార్హం. కాబోయే అధ్యక్షుడి ఫ్యామిలీకి దగ్గరయ్యే సువర్ణ అవకాశంగా పలువురు చెబుతున్న ఈ పోగ్రామ్ లో అంతిమ విజేతగా నిలిస్తే.. తమ వ్యాపార అవకాశాల్ని పుష్కలంగా పెంచుకోవచ్చన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఇవాంకాతో కాఫీ ఖర్చు చివరకు ఎంత వరకు వెళుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/